బాహుబలి -exclusive review

బాహుబలి సినిమాకు నీ రేటింగ్ ఎంత?
త్రివిక్రమ్ “అతడు” సినిమాకు రేటింగ్ ఇచ్చినోళ్ళంతా, ఆ రేటింగ్ ఇప్పుడు చూసుకుంటే కచ్చితంగా సిగ్గుపడతారు. ఇంచుమించు అందరూ ఫెయిల్ అయ్యారు(ప్రేక్షకులు కూడా ఫెయిల్ అయ్యారు). ఆ సినిమా ఎంతబాగుందని అంచనా వెయ్యడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. పవన్ కల్యాణ్ కూడా ఫెయిల్ అయ్యాడు.

మగధీర నుంచి, రాజమౌళి త్రివిక్రమ్‌ను తలదన్నే రీతిలో సినిమాలు తీస్తున్నాడు. బాహుబలి-2 కు రేటింగ్ & రివ్యూలతో సంబంధం లేదు.

సినిమా ఎలా వుంది?
“రాజమౌళి”కి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏.

సినిమాలో ఏమి బాగోలేదు?
బాహుబలి-1 లో “కథ సగమే చెప్పాడు”, “టి.వి సిరియల్ లా సస్పెన్స్ తో ఆపేయడం చాలా చీప్ థికింగ్” అని తిట్టుకొని, బాహుబలి-1 అంత పెద్ద హిట్ అయ్యిందో అర్దం కాని వాళ్ళకు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న, ఒక దిక్కుమాలిన ప్రశ్నగా చాలా ఇరిటేటింగ్ అనిపించింది.

ఆ ప్రశ్నను హైలట్ చెయ్యడం ముఖ్య వుద్దేశం “బాహుబలి-2 కి ప్రిపేర్ చెయ్యడం” అని బాహుబలి-2 చూసాక అర్దం అవుతాది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ను సమాధానమే ప్లాష్ బ్యాక్. ప్లాష్ బ్యాక్ అంతా అత్యద్భుతం. అత్యద్భుతం కంటే ఎక్కువ. ప్లాష్ బ్యాక్ తర్వాత మాత్రం తేలిపోయింది. కలక్షన్స్ పై దాని ప్రభావం ఏమిటనేది అంచనా వెయ్యడం కష్టం కాని, అదొక్కటే డ్రాబ్యాక్. అది కూడా బాగా తీసుంటే ఇంకా బాగుండేది.(for me, సినిమా కోసం వెచ్చించిన డబ్బులు & పార్ట్-1 చూసాక వచ్చిన అసహనం, ఈ ప్లాష్ బ్యాక్ పార్ట్ చూసాక, పటా పంచలు అయిపొయాయి.. )

హైలట్స్ ఏమిటి?
ప్లాష్‌బ్యాక్ మొత్తం హైలట్సే. ప్లాష్‌బ్యాక్ లో వచ్చిన ఫైట్స్ అన్నీ అత్యద్భుతం.

వెయ్యికోట్లు సాధిస్తుందా?
హిందీ వాళ్లకు మన తెలుగువాళ్ళకు అయినంత కనెక్ట్ అయితే ఈజీనే.

ఈ సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్ళు వెచ్చించడం కరెక్టేనా?
పేరంతా రాజమౌళికే వచ్చింది. “సాహో” తో ఇదే హైప్‌ను నిలబెట్టుకోగల్గితే బహుబలి కోసం వెచ్చించిన ఐదేళ్ళకు ఫలితం అనుకొవచ్చు.

bottomline:
“రాజమౌళి”కి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి, Featured, Hari Reviews. Bookmark the permalink.