బాహుబలికి బానిసలు

తెరమీద బాహుబలి ప్రభాస్ అయినా, ప్రభాస్ ఒప్పుకొకపొతే బాహూబలి అనే సినిమా లేకపొయినా, ఈ సినిమా విజయంకు సంబంధించిన ప్రశంసలు అన్నీ, బాహుబలి టీం కెప్టెన్ రాజమౌళికే వస్తున్నాయి. ప్రశంసలు అన్నీ రాజమౌళికే వస్తున్నందుకు ప్రభాస్ అసలు ఫీల్ అయ్యే మనిషి కాదు. ప్రభాస్ అంత ఇగో లేని హిరో తెలుగు ఇండస్ట్రీలో లేడు అనే టాక్ కూడా వుంది. రియల్ బాహూబలి = బాహుబలి టీం కెప్టెన్ = రాజమౌళి.

తెలుగు ప్రేక్షకులంతా రాజమౌళికి బానిసలుగా మారిపొయారు. బాహుబలి కథను చెప్పిన విధానంతో పాటు, సినిమాలో ఏ ఎమోషన్స్ ఎక్కడ పండించాలో, ఎంత మోతాదులో పండించాలో, అంత కచ్చితంగా పండించిన రాజమౌళికి బానిసలు అయిపొయారు.

తెలుగు ఇండస్ట్రీ(పవన్ కల్యాణ్ & త్రివిక్రమ్ మినహా) మాత్రమే కాదు, తమిళ్ ఇండస్ట్రీ మొత్తం రాజమౌళికి ప్రశంసల వర్షం కురిపిస్తుంది.

బాహుబలిలో ప్రభాస్ ఎవరో తెలిసాక, ప్రజలు ఎలా క్రిందికి ఒంగి తమ గౌరవాన్ని చాటుకున్నారో, ఆ విధంగా, మాస్ పల్స్ అంతలా పట్టేసిన దర్శకుడు “రాజమౌళి”కి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి, Featured. Bookmark the permalink.