పబ్లిసిటీ వేరు .. హైప్ వేరు ..
ఏ సినిమాకైనా పబ్లిసిటీ & హైప్ రెండూ చాలా అవసరం. ప్రతి సినిమాను హైప్ చేయలేము. అవకాశం వచ్చినప్పుడు మాక్సిమమ్ హైప్ చేయగల్గాలి. అది నిర్మాత బాద్యత. హైప్ తో హిట్ కొడితే ఆ మజానే వేరు, సినిమా కలక్షన్సే వేరు.
“పబ్లిసిటీ అంటే మా సినిమా నుంచి ఈ అంశాలు ఎక్సపేట్ చెయ్యండి” అని ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం.
సినిమాలో ప్రాముఖ్యత లేని అంశాలతో సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై అంచనాలు పెంచే విధంగా పబ్లిసిటీతో సినిమాను హైప్ చేయడం మరో రకమైన పబ్లిసిటీ.
ఇదివరకు హైప్ అంటే ఎక్కడ రీచ్ అవ్వలెమోనని భయం. ఇప్పుడు రివర్స్ అయ్యింది. ప్రతోళ్ళు సినిమా హైప్ కోసం ఎంచుకోని మార్గం అంటూ లేదు.
హైప్ చెయ్యాలంటే, ముందు దర్శకుడికి నమ్మకం వుండాలి. గబ్బర్‌సింగ్ విషయంలో ఫ్యాన్స్ అందరూ భయపడ్డారు కాని, హరీష్ శంకర్ భయపడలేదు. అంతే కాదు, నావి మాటలు కాదు, మీరే చూడండి అంటూ, “నాకు తిక్క వుంది ..కాని దానికో లెక్క వుంది” అనే డైలాగ్ టీజర్‌తో ఫ్యాన్స్ అందరిలో నమ్మకం కలుగజేసాడు. ఆడియో వచ్చాక చూసుకునే పని లేకుండా పోయింది.
అప్పుడు గబ్బర్‌సింగ్ విషయంలో హరీష్ శంకర్ ఎంత నమ్మకంతో వున్నాడో, బాహుబలి-2 విషయంలో రాజమౌళి డబుల్ నమ్మకంతో వున్నాడు. గబ్బర్‌సింగ్ కేవలం మన తెలుగుకే పరిమితం , బాహుబలి-2 మాత్రం దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుంది.
bottomline:
హైప్ చెయ్యడానికి భయపడకూడదు. హైప్ కోసం తప్పుడు పబ్లిసిటీ కూడా చెయ్యకూడదు. ఒక వ్యూహం ప్రకారం చెయ్యాలి.