తెలుగుసినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసిన దర్శకుడు రాజమౌళి.
ఇంతకు ముందు రాంగోపాలవర్మ “శివ” & శ్యాం ప్రసాద్ రెడ్డి “అమ్మోరు” లాంటి సన్సేషన్ హిట్స్ వచ్చినా, అవి సినిమా రిలీజ్ అయ్యాక జనాలకు తెలిసాయి. కేవలం తెలుగు/తమిళ్ బాషలకే పరిమితం అయ్యాయి.
బాహుబలి స్పెషల్. జనాల అంచనాలు పెంచి మరీ, అంచనాలకు అందనంత పెద్ద కమర్షియల్ కొట్టాడు. దేశం మొత్తం ఊగిపోతుంది.
- తెలుగు C/O బాహుబలి
- ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్ రాజమౌళి
- Indian films are not just Bollywood
- బాహుబలిని మించి రాజమౌళి సినిమాలు తీయగలడు. రాజమౌళి మాత్రమే తీయగలడు.(ఇది కొద్దిగా ఓవర్ అనిపించినా, ప్రస్తుతం నిజం)
ఈ సినిమా చూసాక స్పందించకపొతే తప్పు. మంగళవారం రాత్రి చిరంజీవి, రామ్ చరణ్లు బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తరువాత చరణ్ తన సోషల్ మీడియా పేజ్లో స్పందించాడు. బాహుబలి నిజంగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న చరణ్, రాజమౌళి ఊహ, విజువలైజేషన్లు సినిమా మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయన్నాడు. ఒక గొప్ప సినిమా అన్ని రకాల హద్దులను చెరిపేస్తుందని మరోసారి రుజువైందని, బాహుబలి ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్ అంటూ కీర్తించాడు.
నటీనటులపై కూడా అదే స్థాయిలో స్పందించాడు చరణ్. డార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా అద్భుతంగా కనిపించాడు, నటించాడు. నా మిత్రుడు రానా తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ల నటన కట్టిపడేస్తుంది అంటూ తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశాడు.
bottomline:
బాహుబలి(రాజమౌళి) ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్