బన్నీతో రాజమౌళి

ఇప్పుడు రాజమౌళి తెలుగు దర్శకుడు మాత్రమే కాదు. తెలుగువాళ్ళు మాత్రమే గర్వించే స్థాయి నుంచి భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగే దిశగా బాహుబలి అనే పెద్ద అడుగు వేసాడు.

భారతదేశం స్థాయిలో కనీవిని ఎరుగని రీతిలో అంతటి పెద్ద విజయం సాధించాక, రాజమౌళి చేయబోయే సినిమా ఏమిటనేది ఎవరికిష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అది చెయ్యాలని ఇది చెయ్యాలనే, ఎవరికి తోచిన ఉచిత సలహాలు వాళ్ళు ఇస్తున్నారు.

మన తెలుగు హిరోలకు ఇగో ఎక్కువ. పవన్‌కల్యాణ్ & రామ్ చరణ్ లకు అయితే మరీ ఎక్కువ. తమంతట తాము ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి తనతో సినిమా చెయ్యమని అడగరు. చాలా రేర్. చిరంజీవి, బాలకృష్ణ & మహేష్ బాబులకు కూడా ఏమీ తక్కువ లేదు. ఎంతటి గొప్ప దర్శకులైనా తమ వెంట పదిసార్లు తిరిగితేనే చేస్తారు. రాజమౌళి వాళ్ళతో(except రామ్ చరణ్) ఇప్పటి వరకు చేయకపొవడానికి కారణం అదే.

రాజమౌళి కూడా వాళ్ళ కోసం ఎదురుచూడకుండా, తనకు అందుబాటులో వుండే వాళ్ళతోనే సినిమా చేస్తూ, ఇప్పుడు వాళ్ళకు అందనంత స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలంటే, కేవలం తెలుగుకు పరిమితమయ్యే హిరో అయితే సరిపోదు.

  1. చిరంజీవి & బాలకృష్ణలతో చెయ్యడం అంత కంఫర్ట్ కాదని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు
  2. పవన్ కల్యాణ్ రాజమౌళినే కాదు, ఎవరినీ పట్టించుకోడు
  3. మహేష్‌బాబుకు చెయ్యాలని వున్నా, రెండు సంవత్సారాలు సరిపడా సినిమాలు కమిట్ అయ్యాడు
  4. ఎన్.టి.ఆర్ & రామ్ చరణ్ కూడా బిజీనే

రాజమౌళి తమిళ్ స్టార్స్ కోసమో, హిందీ స్టార్స్ కోసమో కాకుండా, తెలుగు హిరోతో చెయ్యాలనుకుంటే బన్నీతో రాజమౌళి తన నెక్స్ట్ సినిమా చేసే అవకాశం వుంది. ఎప్పుడు ఎవరి దగ్గర తగ్గాలో బన్నీకి బాగా తెలుసు.

bottomline:
ఇది కూడా ఒక ఊహేనని చెప్పనవసరం లేదనుకుంట. హిరో ఎవరైనా, సౌత్ తో పాటు, నార్త్ లో కూడా మళ్ళీ బాక్సులు బద్దలు కొట్టగల రియల్ హిరో రాజమౌళి. now he is bigger than on screen heroes.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in DJ. Bookmark the permalink.