జానీ .. బాహుబలి

Pawan Kalyan‏Verified account @PawanKalyan
My Heartfelt congratulations to Shri Rajmouli,Shri Prabhas &team for their stupendous success of. Bahubali and achieving the 1000 crore mark

Shri Rajmouli with his years of hard work ,tenacity & dedication made alll of us proud.. I wish you many more achievements like this.

ఒకరిని తక్కువ చెయ్యడానికో, ఒకరిని ఎక్కువ చెయ్యడానికో వ్రాస్తన్న ఆర్టికల్ కాదు.

సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి & ఖుషీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఎక్కడానికి ఇంకా మెట్లు లేవు అన్న స్థితి. ఎంతోమంది రైటర్స్ ఎన్నో కథలతో, ఎంతోమంది దర్శకులు పవన్‌కల్యాణ్ తో చెయ్యడానికి ఆసక్తి చూపించినా, ఎవరినీ కాదని ఎంతో శ్రమ తీసుకొని, ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి, “జానీ” అనే సినిమా సొంత కథతో స్వీయా దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేసాడు. సినిమా ఎలా తీయకూడదో తెలియాలంటే జానీ సినిమా చూడండి అనే కామెంట్స్ వినిపించాయి.

స్టుడెంట్ నెం1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ పొకిరి సినిమాను డబుల్ మార్జిన్ తో కొట్టి, ఎక్కడానికి ఇంకా మెట్లు లేవు అన్న స్థితి.

మర్యాద రామన్న, ఈగ సినిమాలతో తనను తాను మరింత అప్‌డేట్ చేసుకొని బాహుబలి తీసాడు రాజమౌళి. 100 కోట్ల తెలుగుసినిమాను, 1000 కోట్లు అంటే, పది రెట్లు పెంచాడు.

జానీ ని మించిన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినా, జానీ ఒక కొలబద్దగా వుండిపోయింది. బాహుబలి మించిన కమర్షియల్ హిట్స్ వచ్చినా, బాహుబలి ఒక కొలబద్దగా సెట్ అయిపోయింది.

జానీ
..
..
..
డిజాస్టర్ ఫ్లాప్
ఫ్లాప్
ఎవరేజ్
హిట్
సూపర్ హిట్
బ్లాక్ బస్టర్ హిట్
ఇండస్ట్రీ హిట్
..
..
..
బాహుబలి హిట్

bottomline:
బాహుబలి కోసం రాజమౌళి ఎంత కష్టపడ్డాడో, జానీ కోసం పవన్ కల్యాణ్ పదిరెట్లు కష్టపడ్డాడు. జానీ సినిమా ఫలితంతో పవన్‌కల్యాణ్‌కు సినిమాలంటే విరక్తి వచ్చింది. బాహుబలి సినిమా ఫలితంతో సౌత్ ఫిలిం బిగ్గెర్ దేన్ నార్త్ ఫిలిం అని నిరూపిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో సినిమా చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి, Featured. Bookmark the permalink.