idlebrain jeevi లాంటోళ్ళు రివ్యూ వ్రాయడానికి కూడా భయపడిన సినిమా సరైనోడు. తీరా చూస్తే 100 కోట్ల సినిమా అయ్యింది. దర్శకుడు బోయపాటి ఎలివేషన్‌కు సరైనోడు అనిపించుకొని, కమర్షియల్ రేంజ్ మరింత పెంచుకున్నాడు బన్నీ.
తెలుగుసినిమా తెలుగుకే పరిమితం కాదు, తెలుగుసినిమా ఇండియా సినిమాకు ఏమీ తక్కువ కాదు అని నిరూపించిన రాజమౌళి “బాహుబలి” తర్వాత వస్తున్న భారీ సినిమా “దువ్వాడ జగన్నాధం”.
- అల్లు అర్జున్ ఫుల్ ఫార్మ్ లో వున్నాడు.
- దేవిశ్రీ ప్రసాద్ డబుల్ ఫార్మ్ లో వున్నాడు.
- హరీష్ శంకర్ ను కొద్దిగా అదుపులో పెట్టేవాళ్ళు వుంటే, తిరుగులేని సినిమా ఇస్తాడని వేరే చెప్పక్కర్లేదు. అదుపులో పెట్టడానికి దిల్ రాజుకు బన్నీ తోడయ్యాడు కాబట్టి, మంచి అవుట్‌పుట్ వస్తుందని ఆశీంచవచ్చు.
బాహుబలి-1 తర్వాత వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో, బాహుబలి-2 తర్వాత వస్తున్న దువ్వాడ జగన్నాధం శ్రీమంతుడిని మించి హిట్ అవుతుందని తెలుగుసినిమా పరిశ్రమ ఆశీస్తుంది.