సినిమాకు కెప్టెన్ ఆ సినిమా దర్శకుడు. కారణం కష్టం అంతా దర్శకుడిదే. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు జాగ్రత్తగా మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాలి. చిరంజీవి సినిమా అనేసరికి అది వేరు. ఫ్లాప్ అయితే, దర్శకుడు సరిగ్గా తీయలేదు, చిరంజీవి మాత్రం బాగా చేసాడని పేరొచ్చేది. కొన్ని సినిమాలు ఎవరేజ్ టాక్ వచ్చేవి. చిరంజీవి మాత్రం సూపర్ చేసాడనే వారు. ఇలా ఫ్లాప్, ఎవరేజ్ టాక్ తో మొదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలెన్నో చిరంజీవికి వున్నాయి. ఫ్లాప్ అయినా, ఓపినింగ్స్ అదిరిపొయేవి. చిరంజీవితో సినిమాలు చేసిన నిర్మాతలు, కొన్న బయ్యర్లు నష్టపొయిన సందర్భాలు చాలా అరుదు.
మనకు చాలా మంది స్టార్ హిరోలు వున్నా, చిరంజీవి తర్వాత చిరంజీవిని రిప్లేస్ చేసిన హిరో రాలేదని చాలామంది అంటూ వుంటారు. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపొయినా తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ పెంచిన హిరో చిరంజీవి అన్నది నిజం. చిరంజీవి కేవలం తెలుగుకే పరిమితం అయ్యాడు. రజనీకాంత్ తెలుగులో సక్సస్ అయినంతగా, చిరంజీవి తమిళ్ లో సక్సస్ కాలేక పొయాడు.
సినిమాల్లో ఎంతో సాధించేసాను, సాధించింది చాలు & సాధించడానికి ఇంకా ఏమి లేదు అనుకొని సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి, ఎన్నో అవమానాలు ఎదుర్కోని, తన మీద తనకే నమ్మకం పోయేంత స్థాయికి చేరుకొని, సినిమాల ద్వారా పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
మగధీర తో తెలుగుసినిమా రేంజ్ డబుల్ చేసి, బాహుబలితో తెలుగుసినిమా రేంజ్ ని జాతీయ స్థాయిలో డబుల్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా దర్శకుడి విజన్. స్టార్ హిరో కేవలం ఓపినింగ్స్ కోసమే. నిజమైన కలక్షన్స్ రావాలంటే దర్శకుడి పనితనమే అంటూ, దేశంలోనే ఏ హిరో అందుకొలేని ఛాలెంజ్ విసిరాడు రాజమౌళి.
మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి పెంచిన కమర్షియల్ రేంజ్ అందుకునే దిశగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారంట. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా, బాహుబలి మాదిరి తమిళ్ & హిందీలో కూడా ప్రయత్నం చేస్తారా అనేది ఇంకా తెలియదు.
bottomline:
- South Indian Movies are Bigger than Hindi Movies అని నిరూపించిన రాజమౌళికి, సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఋణపడి వుంది.
- రాజమౌళికి ధీటుగా నిలబడే ప్రయత్నం చిరు కూడా చెయ్యడం ఆనందదాయకం