మిడియా వక్రీకరణ – తక్కువ చెయ్యడం

ఇమేజ్ అంటే ప్రేక్షకులకు వుండే నమ్మకం. ఉన్నత స్థితిలో వున్న సెలబ్రిటీస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కొద్దిగా ఇగో చూపించినా, సన్సేషన్ కోసం ఎక్కువ చేసి చూపించడం మిడియా బాద్యత. మిడియా వక్రీకరణ & తక్కువ చెయ్యడం అని అంటూ వుంటారు.

చిరంజీవి తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ పెంచిన హిరో అని అందరికీ తెలుసు. అల్లు అరవింద్ పాత్ర ఎంతో వుంది. అల్లు అరవింద్ వ్యూహం బాగా పని చేసింది. చిరంజీవికి ఒక రక్షక కవచంలా విమర్శలు భరించేవాడు.

ఇప్పుడు అల్లు అరవింద్ ఫోకస్ అర్జున్ అర్జున్ పై ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కన్న కొడుకు. ఫోకస్ పెడితే తప్పు లేదు. అర్జున్ అర్జున్ కోసం సొంత ఫ్యామిలి వాళ్ళను తక్కువ చేస్తూ, మెగాఫ్యాన్స్ నే అవమానించడం బాగోలేదని మెగాఫ్యాన్స్ రోదిస్తున్నారు

మనం చేసే పనిలో నెం 1 గా వుండాలని అనుకొవడం తప్పు కాదు. మన సినిమా అందరి సినిమా రికార్డ్స్ ను అధికమించాలని అనుకొవడం అసలు తప్పు కాదు. అలా వుంటేనే కసిగా పని చేయగల్గుతారు. ఈ వారసత్వాన్ని చిరంజీవి నుంచి అల్లు అర్జున్ బాగా తీసుకున్నాడు.

పవన్ కల్యాణ్ & రామ్ చరణ్ రూటు వేరు. కసిగా పని చేస్తారు కాని, నెం 1 కోసమే అన్నట్టు పని చెయ్యరు. పవన్ కల్యాణ్ ఎంచుకొన్న మార్గం కూడా బాగా పని చేసింది. అన్నయ్యకి తగ్గ తమ్ముడు నుంచి, అన్నయ్యను మించిన తమ్ముడు అనిపించుకునే స్థాయికి వెళ్ళాడు. హుందాగా డీల్ చెయ్యవలసిన ఈ పరిస్థితిని, చిరంజీవి అవమానంగా ఫీల్ అవ్వడం, ఈ వీక్‌నెస్ తో అల్లు అర్జున్ రెచ్చిపొవడంతో, మెగాఫ్యాన్స్ మధ్య సిరియస్ గొడవలు ఆఫీషియల్‌గా మొదలయ్యాయి. మెగాఫ్యాన్స్ లో ఒక వర్గం పవన్ కల్యాణ్ ను ఎంత ద్వేషిస్తో, ఒక వర్గం అల్లు అర్జున్ ను అంతే ద్వేషిస్తుంది.

ఇదే అదనుగా మిడియా చిరంజీవిని డైరక్ట్‌గా ఎలా తక్కువ చేసి చూపిస్తుందో చూడండి.

httpv://youtu.be/EuKOyl7aUk0

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Mega Family. Bookmark the permalink.