చలపతి రావు తప్పు మాట్లాడాడు. పొరబాటు జరిగింది.
అందరి ముందు వున్న ప్రశ్న: చలపతి రావు ఏమి చెయ్యాలి?
జవాబు సింపుల్: బహిరంగ క్షమాపణలు చెప్పాలి.
చెప్పాడు. అలా మాట్లాడినందుకు చాలా బాదపడి వుంటాడు. తన అసలు వుద్దేశం ఏమిటో వివరణ కూడా ఇచ్చాడు.
“మహిళలు మనశ్శాంతికి హానికరమా?” అనే ప్రశ్నకు “కాదు” అని చెప్పాలనుకున్నాడు. అత్యుత్సాహమో, అటెక్షన్ కోసమో, వైరటీ అనుకున్నాడో, రాంగోపాలవర్మలా ఘాటుగా చెపుదాం అనుకున్నాడో, బహిరంగంగా అనకూడని మాటలు లైవ్ మైకులో అనేసాడు.
టి.వి లో ఆ షో ఆపేయాలి. ఈ షోలో ఇలా అనకూడదు. అది చేయకూడదు. ఇది చేయకూడదు. అసలు “ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరమా?” అనే ప్రశ్నే చెత్త ప్రశ్న. అని అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగిపోతున్నాడు.
bottomline:
తప్పులు జరగడం సహజం. పొరబాట్లు జరగడం సహజం. మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకొవడమే మన బాద్యత. పొరబాటు చేసి, క్షమాపణలు చెప్పినోడిని ఈ రేంజ్ లో ఏడిపించడం కరెక్ట్ కాదు. ఇదే అదనుగా ఎంతో మందికి ఉపాధి కలిపిస్తున్న వేరే టి.వి షోస్ ను టార్గెట్ చెయ్యడం అసలు కరెక్ట్ కాదు,