ట్వీటర్ ఎకౌంట్ డిలీట్ చేసిన రాంగోపాలవర్మ

“వంగవీటి” సినిమానే తన చివరి తెలుగుసినిమా అని ఎనౌన్స్ చేసాడు. ఆ మాటలు ఎవరూ నమ్మకపొవడం పక్కన పెట్టి, ఎవరూ పెద్దగా పట్టించుకొలేదు.కారణం, నిజాలను అబద్ధాలను బాగా మిక్స్ చేసి, ఫాలోయర్స్ ను కన్‌ఫ్యూజ్ చేస్తూ, ట్వీటర్ ద్వారా మిడియాను ఆటపట్టించడం రాంగోపాలవర్మకు అలవాటు. అలవాటు వ్యసనంగా మారి, తనొక్కడే తెలివైన వాడు, మిగతా ప్రపంచం అంతా తెలివితక్కువ దద్దమ్మలు అని ఫీల్ అయ్యేలా చేసింది.

ట్విటర్లో మాత్రమే బిల్డప్, బయట మాత్రం పెద్ద పిరికోడని మొన్నో ఒక బాలీవుడ్ యాక్టర్ బయట పెట్టాడు. ఎంతో మందికి అవకాశాలు కలిపించిన రాంగోపాలవర్మ,ఎంతో మందికి స్పూర్తి. ఆయన ట్విట్స్ ఇష్యూ మీద కాకుండా, శృతిమించి వ్యక్తుల మీద వెటకారం చెయ్యడం ఎక్కువైంది. చివరకు ఆయన ట్వీట్స్ మీద ఆయనకే విరక్తి వచ్చినట్టు వుంది. ఎకౌంట్ డిలీట్ చేసేసాడు.

50+, పెళ్ళైన ఒక అమ్మాయి వున్న ఈ frustrated వ్యక్తి, ఆ రోజు పనిచెయ్యడానికి కావల్సిన ఎనర్జీ రావడానికి పొద్దున్నే పోర్న్ మూవీస్ చూస్తూ వుంటానని చెప్పుకొవడానికి అసలు సిగ్గుపడడు.. ట్వీటర్ ఎకౌంట్ వదిలేసి, వార్తల్లో వుండటానికి ఏమి చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured. Bookmark the permalink.