ప్రపంచంలో విలువ కట్టలేనిది ఏమైనా వుందంటే, అది అభిమానం మాత్రమే. అభిమానులను అవమానించడం క్షమించరాని నేరం.
వేర్వేరు హిరోల అభిమానులు సరదాగా కొట్టుకొవడం చాలా సామాన్య విషయం. ఒకోసారి శృతిమించి కొట్టుకొవడం జరుగుతూ వుంటుంది. అలా శృతిమించి కొట్టుకొవడం జరగకుండా చూడవలసిన బాద్యత హిరోల మీద వుంది.
కొందరు హిరో/దర్శక/నిర్మాతలు, ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టి, లబ్ధి పొందాలనుకుంటూ వుంటారు. చివరికి ఫ్యాన్స్ ను వెర్రిపప్పలను చెయ్యడం మాములే. చాలా సార్లు జరిగింది. జరుగుతూనే వుంటుంది. అభిమానించడం ఒక వీక్‌నెస్ కాబట్టి, ఎంత అవమానించిన, అభిమానించే వాళ్ళను పట్టుకొని వ్రేలాడటం జరుగుతూ వుంటుంది.
ఫ్యాన్స్ తమ హిరో సినిమానే ప్రధమ స్థానంలో వుండాలనుకుంటారు. మన సినిమా కలక్షన్స్ ఆఫీషియల్ గా ట్రాక్ చేసే సిస్టమ్ లేదు. ఫ్యాన్స్ తమకున్న సోర్సెస్ ద్వారా కలెక్ట్ చేసి, ఎవరి రేంజ్ లో వాళ్ళు వాదించుకుంటూ వుంటారు. నిర్మాత మీద ఒత్తిడి పెట్టి, నిర్మాత ద్వారా ఎనౌన్స్ చేయించుకుంటారు.
ఒక సినిమా కమర్షియల్ విజయం, తర్వాత సినిమాల విజయానికి కొలమానం. నిర్మాత ద్వారా ఎనౌన్స్ చేయించుకుంటారు అనే వీక్‌నెస్ అడ్డు పెట్టుకొని, అల్లు అరవింద్ ఒక వ్యూహం ప్రకారం మెగా హిరోల కమర్షియల్ రేంజ్ పెంచే ప్రయత్నం చేస్తాడు. సక్సస్ అయ్యాడు కూడా. తెలుగుసినిమా ఓపినింగ్స్ ఈ రేంజ్ లో వుండటానికి కారణం, ఇలాంటి వ్యూహత్మక ఫేక్ కలక్షన్స్ కూడా హెల్ప్ అవుతాయి/అయ్యాయి.
bottomline:
కేవలం ఫ్యాన్స్ కోసమే ఫేక్ కలక్షన్స్ చూపించడం అనేది ఒక పెద్ద అబద్ధం. మగధీర లాంటి సినిమాలకు అవసరం లేదు.
అభిమానించడం వీక్‌నెస్. ఆ వీక్‌నెస్ ను వాడుకుంటూ, లబ్ది పొందుతూ, అభిమానులను అవమానించే విధంగా మాట్లాడటం క్షమించరాని నేరం.
httpv://youtu.be/2BO2z57_TtY