హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని ‘డీజే శరణం.. భజే భజే..’ అనే పాటను ఇటీవల విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక నిమిషం నిడివిగల ‘గుడిలో.. బడిలో మడిలో.. ఒడిలో’ అని సాగే వీడియో పాటను రిలీజ్ చేసారు. బన్నీ రోటీన్ గా అనిపించినా, పూజా హెగ్డే బాగా ఆకట్టుకుంది. హరీష్ శంకర్ టేకింగ్ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
జూన్ 23న ‘డీజే’ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
httpv://youtu.be/KzYbhN1d_-Y
ఈ టెక్నిక్ డిజే టీం బాగా వాడుకున్నారు.
httpv://youtu.be/PMivT7MJ41M