అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’. పూజా హెగ్దే కథానాయిక. హరీష్ శంకర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. . ఆదివారం ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో అసలు చిరంజీవి ప్రస్తావన లేకుండా, “డిజె” “డిజె” అంటూ అరిసే ఆర్గనైజడ్ గ్యాంగ్ సమక్షంలో నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు గుప్పెట్లో వున్నట్టు, మెగాఫ్యామిలీ అంతా అల్లు గుప్పెట్లో వుందని క్లియర్ గా అర్దం అయ్యేలా చాలా చప్పగా జరిగింది.
చిరంజీవి & పవన్‌కల్యాణ్ లను ప్రస్తావించని ఏ మెగా ఫంక్షన్ అయినా, వేస్ట్ ఫంక్షన్ అని మెగా అభిమానులు ఫీల్ అవుతూ వుంటారు. వాళ్ళ రిఫెరెన్స్ వచ్చేలా మెగా ఫంక్షన్స్ లో వాళ్ళ స్పీచ్ వుండేలా, మెగా ఫంక్షన్స్ కు వచ్చే అతిధులు గుర్తు పెట్టుకొవాలి.
మెగా అభిమానులు తోపు తోటకూర అనే మాటల కంటే, పవన్‌కల్యాణ్ చిరంజీవిలను ప్రస్తావించడమే మెగా అభిమానులకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. పవన్ కల్యాణ్ చిరంజీవిని ప్రస్తావించడం మర్చిపొయినా, చిరంజీవి పవన్ కల్యాణ్ ను ప్రస్తావించడం మర్చిపొయినా, ఇతర మెగా హిరోలు చిరంజీవి పవన్‌కల్యాణ్ లను మర్చిపొయినా ఆ ఫంక్షన్ అసంపూర్ణమే.డిజె ఫంక్షన్ లో అల్లు అర్జున్, చిరంజీవినే మర్చిపొయాడు. మర్చిపొవడం కాదు, అవసరం లేదు అనుకున్నాడంటే కరెక్టెమో.
హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించడం మాత్రం ఈ ఫంక్షన్ కే హైలట్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానం ఏమిటో ఈ ఫంక్షన్ లో తెలియజేయడం ద్వారా మెగా అభిమానులను ఎంతో ఆనందపరిచాడు.
Thanks to Harish Shankar. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా చూసినా చూడకపొయినా, నీ కోసం సినిమా సూపర్ హిట్ అవ్వాలని, తెలుగుసినిమా ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
httpv://youtu.be/0_6UVul2cDw