బన్నీ అసలు రంగు క్యాచ్ చేసిన greatandhra.com

బన్నీ అసలు టార్గెట్ రామ్‌చరణ్. తెలివిగా చిరంజీవి అసహనాన్ని అడ్డుపెట్టుకొని, పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే చిరంజీవి ఫ్యాన్స్ ను పబ్లిక్ గా ఘోరాతి ఘోరంగా అవమానించాడు.

అల్లు అర్జున్ ఎంత పెద్దోడయినా, చిరంజీవి ఫ్యాన్స్ కు రామ్‌చరణ్ తర్వాతే. ఈ నిజాన్ని జీర్ణించుకొలేక మెగా ఫ్యాన్స్ మధ్యలో విజయవంతంగా పుల్లలు పెట్టేసాడు. సరైనోడు సినిమా బాగోలేదని, మొత్తం మీడియా అంతా ప్రచారం చేసింది. అదేదో మెగాఫ్యాన్స్ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఏ గొట్టంగాడు డిజే బాగోలేదన్నా, మెగా ఫ్యాన్సే చేస్తున్నారనట్టుగా కలరింగ్ ఇస్తున్నారు అల్లు అర్జున్ టీం.

మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఆ స్థానం తీసుకునేది రామ్‌ చరణ్‌ అంటూ అల్లు అర్జున్‌ గతంలో చాలాసార్లు చెప్పాడు. అభిమానులకి ముందు చరణ్‌ తర్వాతే తాను అని ఎన్నోసార్లు నొక్కి మరీ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు వరుస విజయాలతో స్టార్‌గా తన స్థానం పెరిగేసరికి అల్లు అర్జున్‌ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తర్వాత మెగా హీరోల్లో ఆ స్థానం చేజిక్కించుకునేది మీరే అంటున్నారని అల్లు అర్జున్‌తో అంటే దానిని అతను ఖండించలేదు. ఒకింత సిగ్గు పడుతూ దానిని కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని అన్నాడే తప్ప చరణ్‌ ప్రస్తావన కూడా తీసుకురాలేదు.

ప్రస్తుతానికి నిలకడ చూపిస్తూ విజయాలు అందుకుంటోన్న అల్లు అర్జున్‌లో నెక్స్‌ట్‌ మెగాస్టార్‌ని అభిమానులు చూస్తున్నారా అన్నదే ప్రశ్న.

చరణ్‌ తదుపరి రాబోయే చిత్రాలు అతని స్థాయిని నిర్దేశిస్తాయి. ఇదిలావుంటే చిరంజీవిని అనుకరించడానికి, ఆయన పాటలు రీమిక్స్‌ చేయడానికి తాను ఇష్టపడనని, దాంట్లో ఒరిజినాలిటీ వుండదని, తన సొంత ముద్ర వేయడానికే ఇష్టపడతానని అల్లు అర్జున్‌ అన్నాడు.

అతని మాటలు సరాసరి చరణ్‌ని టార్గెట్‌ చేస్తున్నట్టే అనిపించాయి. అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ చాట్‌ చూసిన వారంతా ‘ఇంతలోనే ఎంత మార్పు!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

–greatandhra.com

bottomline:
అల్లు అర్జున్ వ్యూహం వర్క్ అవుతుంది. అల్లు అర్జున్ అందరివాడు. మెగాఫ్యాన్స్ తో పని లేదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in DJ. Bookmark the permalink.