వేగం పెంచిన రంగస్థలం 1985

ఓ కొత్త అనుభూతి ఇచ్చే చిత్రం ‘రంగస్థలం 1985’. నటుడిగా నాకు సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. తూర్పు గోదావరి తీరంలోని పల్లెటూళ్లలో చిత్రీకరిస్తున్నాం. ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది — రామ్‌చరణ్‌.

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. రామ్‌చరణ్‌ చెవిటివాడి పాత్ర పోషిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 1985… ఆ ప్రాంతంలో జరిగే కథ ఇది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సమంత కథానాయిక.

ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ రామ్‌చరణ్‌, మరికొంతమంది ఫైటర్ల మధ్య ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో ఈ యాక్షన్‌ దృశ్యాలు రూపుదిద్దుకొంటున్నాయి. 2018 సంక్రాంతికి రిలీజ్ కాబోయే ఈ చిత్రం వేగం పెంచినట్టున్నారు. పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ సినిమా రిలీజ్ ని బట్టి ఈ సినిమా రిలీజ్ మారే అవకాశాలు వున్నాయి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రంగస్థలం, Featured. Bookmark the permalink.