బన్నీకి ఆ మాత్రం బలుపు వుండాల్సిందే

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్డే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం శుక్రవారం (జూన్‌ 23న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కలిపి దాదాపు 1000 థియేటర్లలో ‘డీజే’ విడుదలైంది. అమెరికాలో 300 స్క్రీన్లపై, కెనడాలో 10 స్క్రీన్లపై సినిమా ఆడుతోంది.

అమెరికా ప్రీమియర్‌ షోలో ‘డీజే’ మంచి వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అక్కడ అల్లు అర్జున్‌ ‘సరైనోడు’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ గత రికార్డులను ‘డీజే’ దాటిందట. ఇప్పుడు అమెరికాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన అల్లు అర్జున్‌ చిత్రంగా ‘డీజే’ నిలిచినట్లు తెలుస్తోంది. కేవలం ప్రీమియర్‌ షోలో చిత్రం 4 లక్షల డాలర్లు (రూ. 2.57 కోట్లు) వసూలు చేసినట్లు చెబుతున్నారు. తొలివారంలోనే చిత్రం 1 మిలియన్‌ డాలర్ల వసూళ్లను దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా ప్రీమియర్‌లో ‘సరైనోడు’ 1,90,796 డాలర్లు (రూ. 1.23 కోట్లు), ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ 3,47,267 డాలర్లు (రూ. 2.23 కోట్లు), ‘రేసుగుర్రం’ 1,02,782 డాలర్లు (దాదాపు రూ. 66లక్షలు) వసూలు చేశాయి.

బన్నీకి ఇప్పుడు చిరంజీవి & పవన్ కల్యాణ్ అవసరం లేదు. మెగాఫ్యాన్స్ అవసరం అంత కన్నా లేదు. బన్నీ కేవలం మెగాఫ్యాన్స్ కు మాత్రమే చెందిన వాడు కాదు. బన్నీ అందరివాడని ఫస్ట్ డే కలక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. “కేవలం మెగా అభిమానులు సపోర్ట్ చేస్తే సినిమాలు ఆడవు. సినిమా బాగుంటే అందరూ ఆదరిస్తారు.” అనే బన్నీ సరికొత్త రాగం విజయం సాధించింది.

bottomline:
మెగా హిరోలందరూ అల్లు ఫ్యామిలీ గుప్పెట్లో వున్నారు. ఖండించలేని పరిస్థితులు. డబ్బా కొట్టడానికి మెగాఫ్యాన్స్ తో పని లేదు , 24X7 పనిచేసే ఒక సెపరేట్ టీమే వుంది.

అల్లు శిరీష్ కూడా అల్లు అర్జున్ స్థాయికి చేరుకునే రోజు అతి దగ్గర్లోనే వుంది. తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న అల్లు అరవింద్ కొడుకుగా, బన్నీకి ఆ మాత్రం బలుపు వుండాల్సిందే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in DJ. Bookmark the permalink.