సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు. అంత కష్టపడి పని చేసిన సినిమాను ఎవరైనా విమర్శిస్తే తట్టుకొలేరు.
డిజె పక్కా మాస్ కమర్షియల్ సినిమా. అందరికీ నచ్చదు. వెబ్ రివ్యూలు అలానే వున్నాయి. మాస్ సినిమాలని చిన్నచూపు చూడటం అనేది నెట్ ప్రపంచంలో ఎప్పటినుండో వుంది.
హిరో బ్రహ్మణ్ రోల్ అనేటప్పటికి సాగర సంగమం లాంటి సినిమా ఎక్సపెట్ చేసినోళ్ళు, డిస్సాపాయింట్ అయ్యారు. ఓవర్ ఎక్సపెటేషన్స్ పెట్టుకున్నోళ్ళు, కొందరు రీసెంట్ గా వచ్చిన జూ ఎన్.టి.ఆర్ అదుర్స్ తో పొల్చుకుంటూ డిస్సాపాయింట్ అయ్యారు. ఇవన్నీ సహజమైన రియాక్షన్స్. ఇన్నీ నెగిటివ్ రియాక్షన్స్ వున్నా, ఓపినింగ్స్ ఊహించని రీతిలో వచ్చాయి. కృతజ్ఞతగా థాంక్యు ఫంక్షన్ అని పేరు పెట్టుకొని సినిమాను పబ్లిసిటీ చేసే పనిలో పడ్డారు.
ఇంతవరకు బాగానే వుంది, ఫంక్షన్ కు తగ్గట్టు గానే అల్లు అర్జున్ స్పీచ్ చాలా హుందాగా వుంది. మెగాఫ్యాన్స్ కు కూడా థాంక్స్ చెప్పాడు. (ఇది సరిపోదనుకొండి) హరీష్ శంకర్ అతి వాగుడుపై, ఆ అధిక ప్రసంగానికి అల్లు అర్జున్ వెకిలి చేష్టలుపై వెబ్ మిడియా(నెగిటివ్ రివ్యూలు వ్రాసేది వాళ్ళే .. ఆ పాపం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పైకి నేట్టేసేది వాళ్ళే) గుర్రుగా వుంది.