ప్రేక్షకులు దేవుళ్ళు

  1. ప్రేక్షకులు దేవుళ్ళు. అభిమానులు దేవుళ్ళకే దేవుళ్ళు. డబ్బులు & టైం వెచ్చించి సినిమాలు చూసే ప్రేక్షకులు అందరూ దేవుళ్ళు. నయా పైసా ఉపయోగం కాదు, చేతి నుండి డబ్బులు దూల తీర్చుకునే వాళ్ళు, ఏ సంబంధం లేకుండా సినిమాను ఓన్ చేసుకొని ఆరాధించే సినిమా అభిమానులు, దేవుళ్ళకే దేవుళ్ళు.
  2. బొంగులే.. సినిమా బాగోకపొతే చూస్తారా ? సినిమా బాగుంటూనే కదా, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారు. ప్రేక్షకులు గొర్రెలు. అభిమానులు వెర్రోళ్ళు” అని కూడా వాదించే వాళ్ళు వున్నారు.

పై రెండిట్లో ఏది నిజం అంటే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి నమ్మకం వాళ్ళది.

అభిమానించడం అంటే కనెక్ట్ అవ్వడం. ప్రస్తుతం వారసత్వం & కులం చూసి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువయ్యారు అంటే తప్పు కాదెమో.

అలా వారసత్వం & కులం చూసి కనెక్ట్ అయ్యారని, మంచి సినిమాకు రోజులేవనుకుంటే తప్పు. ప్రేక్షకులు దేవుళ్ళు. మంచి సినిమాను వారత్వం & కులం లకు ఆతీతంగా ఆదరిస్తారు.

అభిమానులు దేవుళ్ళకే దేవుళ్ళు. ఎవరేజ్ సినిమాను తమ అభిమాన హాడావుడి & సపోర్ట్ తో రేంజ్ పెంచుతారు. “కేవలం అభిమానులు ఆదరిస్తే సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వవు. అందరూ చూస్తేనే పెద్ద పెద్ద హిట్లు అవుతాయి.” ఇది జగమెరిగిన సత్యం.

దురదృష్టం ఏమిటంటే, అతి అభిమానం వలన, అభిమానులకు అవమానాలు జరుగుతున్నాయి. హిరోలు సహనం కొల్పోతున్నారు. “మీ అతి అభిమానం మాకొద్దు, మేము కూర్చోమంటే కూర్చోవాలి, నుంచో మంటే నుంచోవాలి” అనే స్థాయికి మన హిరోలు వచ్చేసారు. అభిమానులను మందలిస్తే తప్పు లేదు కాని, అవమానిస్తున్నారు మన హిరోలు.

చిరంజీవి అభిమానులను నొప్పించకుండా ఎలా కంట్రోల్ చెయ్యాలో బాగా తెలుసు. అభిమానులకు గౌరవం తెచ్చిన హిరో చిరంజీవి. అల్లు అరవింద్ సపొర్ట్ పాజిటివ్ గా వుండేది.

అల్లు అర్జున్ కూడా స్టార్ హిరో అయ్యాక, ప్రొబల్మం స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ను మార్చేసాడు. “కేవలం అభిమానులు ఆదరిస్తే సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వవు. అందరూ చూస్తేనే పెద్ద పెద్ద హిట్లు అవుతాయి.” అనే రాగం మొదలుపెట్టారు.

అల్లు అర్జున్ కు చిరంజీవితో రక్త సంబంధం లేకుండా చిరంజీవి అభిమానుల అండ కోసం చిరంజీవి మేనల్లుడు అని చెప్పుకొని, కంఫర్టబుల్ జోన్ లోకి వచ్చాక, మెగా అభిమానులు ఊకలో ఈక అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే మెగా అభిమానులని అడ్డుపెట్టుకొని, చిరంజీవిని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

పవన్ కల్యాణ్ ను తిట్టే చిరంజీవి అభిమానులెందరో కాని, అది అభిమానంతోనే తప్ప ద్వేషంతో కాదు. చిరంజీవి తర్వాతే పవన్ కల్యాణ్ అని వాళ్ళ వుద్దేశం తప్ప, మరేమి కాదు. వాళ్ళు పవన్ కల్యాణ్ ను ఇచ్చే సపోర్ట్ ఎంతో బలం. వాళ్ళను ఎప్పుడూ పవన్ కల్యాణ్ అవమానించలేదు.

అల్లు అర్జున్ ను ఎవరైనా మెగా అభిమానులు విమర్శిస్తున్నారు అంటే, రామ్ చరణ్ తర్వాతే అల్లు అర్జున్ అని అర్దం. అల్లు అరవింద్ చిరంజీవికి ఎంత గౌరవం ఇచ్చేవాడో, అదే గౌరవం అల్లు అర్జున్ రామ్ చరణ్ కు ఇవ్వాలని కోరుకుంటున్నారు. చిరంజీవి/రామ్‌చరణ్ అంటే ఇష్టం లేని కొందరు, అల్లు అర్జున్ ను “నీకేం తక్కువ” అనే పొగడ్తలకు నిజంగానే పడిపోయి, మెగా అభిమానులను అవమానించే విధంగా ప్రవర్తించడం తప్పు.

bottomline:
అభిమానులను అవమానించడం తప్పు

to readers of this post:
అర్దం అయ్యేలా చెప్పడం కన్నా అర్దం చేసుకొవడం కష్టం అనుకుంటే అర్దానికి కుడా అర్దం కాదని అర్దం. అర్దం చేసుకొండి. అపార్దం చేసుకోవద్దు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, just4FUN. Bookmark the permalink.