నాని, నివేదా థామస్ జంటగా డీవీవీ ఎంటర్టైనమెంట్స్ ఎల్.ఎల్.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొంది జూలై 7 న రిలీజ్ కాబోతున్న చిత్రం ‘నిన్ను కోరి’. హిరో నాని, వైరటీగా ఒట్టేసి మరీ చెప్పాడు, “నిన్ను కోరి” సినిమా మనసును హత్తుకునే సినిమా అవుద్ది అని. మాస్ కు నచ్చకపొయినా, ఓవర్సీస్ లో 1 మిలియన్ గ్యారంటీ అని అర్దం చేసుకొవచ్చు..
ప్రిమియర్ షోస్ 30 డాలర్లు, మాములు షోస్ 20 డాలర్లు రేటు పెట్టి అభిమానుల వీక్నెస్ అడ్డుపెట్టుకొని దోచేసుకుంటూ వుంటారు మన పెద్ద హిరోలు.. మేము కింగ్స్ అంటే మేము కింగ్స్ అని సెల్ఫ్ డబ్బాలు కొట్టేసుకుంటూ వుంటారు.
ఒక సినిమాను ఎంతమంది చూసారనేది అసలైన కొలబద్ద. అభిమానుల దగ్గర దోచుకున్న కలక్షన్స్ కాదు.
కారణాలు ఏదైనా రెగ్యులర్ టిక్కెటు రేటుతో, మినిమమ్ 1 మిలియన్ డాలర్ల కలక్షన్స్ సాధించే రియల్ ఓవర్సీస్ నెం 1 హిరో నాని అనటంలో ఎటువంటి సందేహం లేదు.
bottomline:
దోపిడి అంటే అభిమానులకు కోపం. మా గులకొద్ది మేము చూస్తున్నాం, మధ్యలో నువ్వు ఏవడ్రా అని తిడతారు. నాని గోల్ కూడా ప్రిమియర్ షోస్ 30 డాలర్లు, మాములు షోస్ 20 డాలర్లు రేటు అయివుండవచ్చు.
httpv://youtu.be/TSthgjcKdds