పవన్ కల్యాణ్ “గబ్బర్ సింగ్”, హిందీ సినిమా దబాంగ్ కు రిమేక్. ఎన్నో సౌత్ ఇండియా సినిమాలను మిక్స్ చేసి తీసిన ఆ సినిమా రిమేక్ చెయ్యడం ఏమిటని చాలామంది విమర్శించారు. “నాకు తిక్కుంది .. కాని దానికో లెక్కుంది ..” అంటూ వచ్చిన గబ్బర్ సింగ్ టీజర్, ఆ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.
పవర్ “బాబీ” పక్కా మాస్ & కమర్షియల్ డైరక్టర్. మొదటి సినిమా సూపర్ హిట్ కాకపొయినా హిట్ అనిపించుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవ్వడం వలన పెద్ద డ్యామేజ్ ఏమి జరగలేదు. ఎన్.టి.ఆర్ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఎన్.టి.ఆర్ అభిమానుల్లో మాత్రం కొద్దిగా భయం, కొన్ని అనుమానాలు వున్నాయి.
ఎన్నో అనుమానాలతో వున్న అభిమానులకు, గబ్బర్ సింగ్ టీజర్ వచ్చి అభిమానుల్లో ఎటువంటి అంచనాలు లేపిందో, ఇప్పుడు జై లవ కుశ టీజర్ అటువంటి అంచనాలనే అభిమానుల్లో క్రియేట్ చేసేలా వుందనవచ్చు.
అభిమానులు కాకుండా, మిగతా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఎన్.టి.ఆర్ పెరఫార్మన్స్ కు స్కోప్ వున్న కమర్షియల్ సినిమా వస్తుందని అర్దమవుతుంది. పరఫెక్ట్ టీజర్ తో పబ్లిసిటీ కరెక్ట్ గా స్టార్ట్ చేసారని రాజమౌళి కూడా మెచ్చుకున్నాడు.తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ మరింత పెంచే సినిమా కావాలి.
rajamouli ssVerified account @ssrajamouli
Too Good, @Tarak9999 … THIS is how you start the publicity of a film…Just WOW… #JaiTeaser
httpv://youtu.be/_wcs7ixyDbY