సాయి ధర్మ్ తేజ్ హిరోగా నిలబడతాడో లేదో అనే అనుమానం వుంది కాని, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం కచ్చితంగా హిరోగా నిలబడతాడనే నమ్మకం మెగా ఫ్యామిలీలో వుంది.
టైం పడుతుందనుకుంటే సాయి ధర్మ్ తేజ్ మాస్ లో తొందరగా నిలబడిపొయాడు. థాంక్స్ టు ఎల్.వి.కుమార్ చౌదరి & అనిల్ రావిపూడి. మాంచి స్క్రిప్ట్స్ తో నిలబెట్టారు.
వరుణ్ తేజ్ టాప్ డైరక్టర్స్ తో చేసాడు కాని, లక్ కలిసి రాలేదు. ఫిదా కూడా టాప్ డైరక్టరే. ఈ సినిమా ఏమవుతుందో అనే టెన్షన్ మెగా అభిమానుల్లో వుంది.
శేఖర్ కమ్ముల మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో వున్నాడు. “సినిమా 3, 4 సార్లు చూశా. యంగ్‌స్టర్స్, ఫ్యామిలీస్, అమ్మాయిలు తప్పకుండా చూస్తారు. దుమ్ము దులుపేస్తది ఈ సినిమా. వరుణ్‌తేజ్, సాయిపల్లవి డన్ ఎ ఫాబ్యులస్ జాబ్. ప్రతి ఒక్కరూ 2,3 సార్లు చూస్తారు.” అని అంటున్నాడు.