"ఫిదా"లో పెద్ద కథేమీ లేదు

ఈ వారం సినిమా మెగా ప్రిన్స్ ఫిదా.

శేఖర్ కమ్ముల ఫాంలో లేకపొవడంతో, గ్యారంటీ సూపర్ హిట్ అని అంటున్న ఆయన మాటలు నమ్మలేని స్థితిలో ప్రేక్షకులున్నారు. హిరోయిన్ సాయిపల్లవి వరుణ్ తేజ్ పక్కన కాస్త పొట్టిగా కనిపిస్తుంది. తెలంగాణ యాస ఎక్కువగా వాడేసారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ మాత్రం “శేఖర్‌ కమ్ముల సినిమాల్లో పెద్ద కథేమీ ఉండదు. సున్నితమైన అంశాలతో మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దుతుంటారు. ‘ఫిదా’ కథలో నాకు నచ్చింది కూడా అదే” అని అంటున్నాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ మీద సింపతి బాగా వుంది. “ఫిదా” హిట్ అవ్వాలని మెగా అభిమానులే కాదు, అభిమానంతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ కు లక్ కలిసి రావడం లేదు. దిల్ రాజు లక్ ఏమైనా కలిసొస్తుందెమో చూడాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఫిదా, Featured. Bookmark the permalink.