ఈ వారం తెలుగుసినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా. హిరోయిన్ ఓరియెంటెడ్ తెలంగాణ తెలుగుసినిమా. హిరోయిన్ సాయి పల్లవి ప్రాణం పోసింది. ఈ సినిమా నచ్చని తెలంగాణ వాళ్ళు వుండరంటే అతి శయోక్తి కాదు. శేఖర్ కమ్ముల టీం బాగా వర్క్ చేసారు.
ఫస్టాఫ్ ఎక్సట్రార్డనరీ. సెకండాఫ్ నీరసంగా వుంది. ఇది మాస్ ప్రేక్షకుల టాక్.
ఈ సినిమా ఎక్సపెట్ చేసినట్టుగానే లేడిస్ కు విపరీతంగా నచ్చేసింది. యూత్ కూడా బాగా కనెక్ట్ అయిపొయారు. లేడీస్ & యూత్ ఎంతలా కనెక్ట్ అయ్యారంటే, స్లో సెకండాఫ్ ను క్షమించేసారు.
శేఖర్ కమ్ముల కష్టాన్ని & నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు.
వరుణ్ తేజ్ ను స్టార్ ను చేసే సినిమా కాకపొయినా, సినిమా హిట్ అవ్వడం వలన, వరుణ్ మంచి కథలను ఎంచుకొవడానికి అవకాశం కలిపించే సినిమా అవుతుంది.