“1” నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ కు దగ్గరయ్యి, నాన్నకు ప్రేమతో సినిమాతో నందమూరి అభిమానులకు దగ్గరయిన సుకుమార్, ఇప్పుడు రంగస్థలం 1985 సినిమాతో మెగాఫ్యాన్స్ కు దగ్గరయ్యే పనిలో వున్నాడు. ఒక పక్క దర్శకుడిగా ఎంతో బిజీగా వుంటూనే, తన నుంచి ఆశీంచే ఫ్రెండ్స్ & ఫ్యామిలీ ల కోసం, సుకుమార్ రైటింగ్స్ పేరుతో సినిమాలు అందిస్తున్నాడు.
పూరి జగన్నాధ్ “నేనింతే”, రాంగోపాలవర్మ “అప్పలరాజు” తరహాలో అనిపిస్తున్న సినిమా “దర్శకుడు” .
“అసలు దర్శకుడు ఏమి చేస్తాడు?” అనే ప్రశ్నతో పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమా వాళ్ళకు సంబంధించిన సినిమా అని హైప్ రాలేదు.
దిల్ రాజు & అల్లు అరవింద్ సపోర్ట్ వుండటం వలన థియేటర్స్ కు డోకా లేదు. ఎన్.టి.ఆర్ & రామ్ చరణ్ చేతుల మీదగా టీజర్ & ఆడియో రిలీజ్ చేయడం వలన .. సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చే అవకాశం వుంది. టాక్ వస్తే మంచి కమర్షియల్ హిట్ అయ్యే అవకాశం కూడా వుంది.