BARajuVerified account @baraju_SuperHit
PowerStar Pawan Kalyan, Trivikram’s film Produced by S.Radha Krishna is being planned to release on Jan 10th for Sankranthi #PSPK25
తెలుగు ఇండస్ట్రీలో మెగాహిరోలు సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తూ వుంటారు. వేరే హిరోలు సెట్ చేస్తే, వాటిని మెగా హిరోలు బ్రేక్ చేసే దాకా వారిపై ఒత్తిడి వుంటుంది.
కాని ఈసారి, బాహుబలి సెట్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చెయ్యడం మెగా హిరోలకు కూడా సాధ్యం కాదని అందరూ ఫిక్స్ అయిపొయారు. జాతీయ స్థాయిలో సాధ్యం కాకపొయినా, తెలుగులో అయినా, బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తారా అనే డౌట్స్ మొదలయ్యాయి.
తెలుగులో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయగల్గే స్థాయిలో రెండు మెగా సినిమాలు తయారవుతున్నాయి.
- రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్
- పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్
ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రామ్‌చరణ్-సుకుమార్ “రంగస్థలం 1985” సినిమా 2018 సంక్రాంతికి రిలీజ్ అని ఏనౌన్స్ చేసారు. పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ మూవీ జనవరి 10, 2018 అంటున్నారు.
క్రిందటి సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా కోసం తన “ధృవ” సినిమాను ఒక నెల ముందే రిలీజ్ చేసాడు. ఎంత నిజమో తెలియదు కాని, ఇప్పుడు బాబాయ్ 25 వ సినిమా కోసం కూడా ఈ సంక్రాంతిని త్యాగం చేస్తాడనే ప్రచారం జరుగుతుంది.
bottomline:
వ్యూహాత్మకమైన పబ్లిసిటీ, హైప్ క్రియేట్ చేయవలసిన ఈ రెండుసినిమాలను, మెగా అభిమానులను ఇలా కన్‌ఫ్యూజన్ లో నెట్టే విధంగా రిలీజ్ డేట్స్ లీక్ చెయ్యడమో, ఎనౌన్స్ చెయ్యడమో కరెక్ట్ కాదు.