సినిమా ప్రేక్షకుల్లో, మిడియాలో ఈ శుక్రవారం టాలీవుడ్ పరంగా మంచి ఆసక్తి నెలకొననుంది. దానికి కారణం:
- “అ ఆ” ఇమేజ్ తో వస్తున్న నితిన్ సినిమా “లై”
- “సరైనోడు” ఇమేజ్ తో వస్తున్న బోయపాటి సినిమా “జయ జానకి నాయక”
- “బాహుబలి” ఇమేజ్ తో వస్తున్న రానా సినిమా “నేనే రాజు నేనే మంత్రి”
మూడింటిపైనా బోలెడంత పాజిటివ్ క్రేజే ఉంది.
రానా సినిమా తక్కువ బడ్జెట్ & రెండు బాషాల్లో రిలీజ్ అవుతుంది. రాజకీయాలు బ్యాక్‌డ్రాప్ కావడంతో మంచి టాక్ వచ్చినా లాస్ట్ ప్రిఫరెన్స్.
బోయపాటి సినిమా ఎంత సెంటిమెంట్ వున్నా, లవ్ స్టోరీ వున్నా, పక్కా మాస్ గా వుంటుంది. క్లాస్ ప్రేక్షకులకు సెకండ్ ప్రిఫరెన్స్.
క్లాస్ & మాస్ తేడా లేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ “లై” అనోచ్చు. నితిన్ క్రేజ్ కు తోడు, దర్శకుడు హను మీద చాలా హోప్స్ వున్నాయి.
bottomline:
ఎవరి లక్ ఎలా వుందో కాని:
- హిట్ ఫట్ రానా కు పెద్ద లాభ నష్టాలు ఏమి వుండవు.
- బోయపాటి సినిమా హిట్ అవ్వడం హిరో “సాయి” కి ఎంతో కీలకం.
- “లై” తో రేంజ్ పెంచుకొవడం హిరో “నితిన్” కి ఎంతో అవసరం.