వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో, నితిన్ హీరోగా, రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన చిత్రం ‘లై’ (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి) ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నితిన్ సరికొత్త లుక్ మాస్ కు మాత్రమే కాదు, క్లాస్ కు కూడా నచ్చే విధంగా వుంది.
ట్రైలర్ తో ‘లై’ మూవీ యాక్షన్ ప్యాక్డ్స్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే ఫన్ ఎలిమెంట్స్, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎలిమెంట్స్ లాంటి వాటికి థ్రిల్ జోడించి ఎంతో ఆసక్తికరంగా సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
లై -4 days to go!!!!!