రామ్ చరణ్👍

హిరో క్రేజ్ మీదో, హిరో-దర్శకుడు క్రేజ్ మీదో, దర్శకుడు క్రేజ్ మీదో మాత్రమే సినిమాకు జనాలు వస్తారు. ఆ క్రేజ్ చుట్టే ఎక్కువ మంది నిర్మాతలు తిరుగుతూ పెట్టుబడి పెట్టడం వలన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతకు విలువ లేదు.

ఇప్పుడు చిరంజీవి క్రేజ్ మీదే నిర్మిస్తున్న చిత్రం అయినా, నార్మల్ మాస్ మసాలా సినిమా కాకుండా, మరో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలుగజేద్దాం అనే ఆలోచనతో “ఊయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవిత చరిత్రను అందిస్తున్న నిర్మాత రామ్‌చరణ్ కు అభినందనలు.

ధృవ సినిమా ద్వారా చిరంజీవి ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపొయిన కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి, ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కచ్చితంగా కమర్షియల్ హిట్ అవ్వడానికి దొహదపడే పెద్ద అంశం.

భారీ బడ్జెట్ తో, ప్రముఖ తారాగణంతో రూపొందనున్న ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్ని పూర్తి చేసిన టీమ్, నేషనల్ లెవెల్లో అగ్ర పరిశ్రమల నుండి నటీ నటుల్ని తీసుకునే పనిలో నిమగ్నమైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ‘బాహుబలి’ తో తెలుగుసినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళికి కూడా అభినందనలు.

హిట్టా ఫట్టా తర్వాత .. ప్రయత్నం చెయ్యాలి. కేవలం కష్టపడటం మాత్రమే కాదు, ఎన్నో డబ్బులతో ముడిపడిన వ్యవహారం. నిర్మాత రామ్‌చరణ్ కు అభినందనలు.

Ganesh Ravuri‏ @ganeshravuri
Rajamouli tho chesthe chuddam annattu #BB scale evaru try kuda cheyyatle. RM chesinapudu manamenduku cheyalemani attempting #UNR. Megastar 👍

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సైరా నరసింహారెడ్డి, Featured. Bookmark the permalink.