ఒకప్పుడు:
అసలు నిజం:
చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ కు & రామ్ చరణ్ కు ఇచ్చినంత గౌరవం అల్లు అర్జున్ కు ఇవ్వరు. సపోర్ట్ మాత్రం ఇస్తారు & ఏ మాత్రం తక్కువ కాదు.
ఒక మెగా అభిమానిగా చూస్తే, ఈ విషయం చాలా లైట్ గా తీసుకొవచ్చు. కాని అల్లు అర్జున్ పైకి చెప్పకపొయినా చాలా సిరియస్ గా తీసుకున్నాడు. తీసుకున్నోడు తన ఎదుగుదల కోసం మెగా భజన(చిరంజీవి, పవన్ కల్యాణ్ & రామ్ చరణ్ భజన) చెయ్యకుండా వుంటే బాగుండేది. వాళ్ళ పేర్లు వాడకుండా & వాళ్ళ భజన చెయ్యకుండా మెగా అభిమానులు నన్ను వదలరని చెప్పి మరీ వాళ్ళ భజన చేసేవాడు.
ఎప్పటి నుండో పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తే పబ్లిక్ ఫంక్షన్స్ లో ఒక వైబ్రేషన్ వస్తుంది. అది ఇప్పటికి కొనసాగుతుంది. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఈ మధ్య(రాజకీయ వైఫల్యంతో) చిరంజీవికి ఒకింత అసహనం కలిగిస్తుంది.
అల్లు అర్జున్ జులాయితో స్టార్డం, రేసుగుర్రంతో సూపర్ స్టార్డం సంపాధించుకున్నాడు. ఆ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో కూడా మెగా భజన చేసాడు.
ఇప్పుడు:
అసలు నిజం:
ఎవడెవడో తెలియకుండా మెగాఫ్యాన్ అనటం, చిరంజీవినో, పవన్ కల్యాణ్ నో, అల్లు అర్జున్ నో, రామ్ చరణ్ నో .. ఇష్టం వచ్చినట్టు హద్దులు లేకుండా విమర్శలు చేసేస్తున్నారు. దానికి కారణం కచ్చితంగా అల్లు అర్జునే.
అల్లు అర్జున్, చిరంజీవి అసహనాన్ని అడ్డుపెట్టుకొని, తను పెద్ద స్టార్ ని అని ఫీల్ అయిపొయి, మెగా అభిమానులను పబ్లిక్ గా అవమానించి, మెగా అభిమానుల రిఫరెన్స్ లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు.
అల్లు అర్జున్ ప్రభావం అల్లు అరవింద్ పై కూడా కనపడుతుంది. అల్లు అర్జున్ ని పవన్ కల్యాణ్ & రామ్ చరణ్ లతో కలిపేసాడు. అలానే అల్లు శిరీష్ ను వరుణ్ తేజ్ & సాయి ధర్మ్ తేజ్ లతో కలిపేసాడు.
చిరంజీవిగారు సినీ పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అందులో నాది ఆయనతో 37 ఏళ్ల జర్నీ. అందులో నాకు ఎంత తృప్తి ఉంటుందో మీరు ఊహించుకోగలరు. ఆయన కష్టంతో ఓ తారు రొడ్డు వేశారు. పవన్ కల్యాణ్ దగ్గర నుంచి రామ్ చరణ్ దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, వరుణ్, తేజ్, శిరీష్ అంతా ఆరోడ్డులోనే నడుస్తున్నారు.
–అల్లు అరవింద్
httpv://youtu.be/QfsPm15cA4g