‘అర్జున్ రెడ్డి’…. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.
సినిమా దర్శకుడి సృష్టి or విజన్. నిర్మాత ధైర్యం or వ్యాపారం. స్క్రీన్ మీద కనిపించేది నటులు. నటుల్లో హిరో మీదే కథ నడుస్తుంది కాబట్టి, హిరోలకు ఎక్కువ పేరు వస్తుంది.
చిరంజీవి. ఎంత పెద్ద దర్శకుడు డైరక్షన్ లో చేసినా, తన నటనతోనో, ఫైట్స్ తోనో, పాటలతోనో పూర్తిగా డామినేట్ చేసేసేవాడు. మిగతా నటులు కేవలం సపోర్టింగ్ రోల్స్ గా కనిపించేవి. హిరో ఇమేజ్ మీద నడిచే కథ వుంటే సరిపొయేది. పొరబాటున మంచి కథ చిరంజీవిని డామినేట్ చేసే విధంగా వుంటే, కలక్షన్స్ తగ్గేవి.
ఇప్పుడు అలా లేదు. దర్శకులకు కూడా డిమాండ్ పెరిగింది. త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళి, వినాయక్, హరిష్ శంకర్, పైడిపల్లి వంశీ, కొరటాల శివ లాంటి దర్శకులు వుంటే, సినిమా రేంజ్ మరింత పెరుగుతుంది. ఫిదా, అ ఆ, మర్యాద రామన్న, ఈగ సినిమాలు పూర్తిగా దర్శకుడు ఎకౌంట్ లోకి వెళ్ళిపొయాయి.
ఈ సినిమా కష్టం/విజన్ అంతా సందీప్ రెడ్డిది. కాని, అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ నటించిన తీరు, దర్శకుడిని మర్చిపొయేలా చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషుకులు.(బద్రి సినిమా పూరి జగన్నాధ్ సృష్టి అయినా, పేరంతా పవన్ కల్యాణ్ కు వచ్చినట్టు)
ప్రస్తుతం వున్న స్టార్ హిరోలందరూ హిరో రోల్ డామినేట్ చేసే విధంగా కథలు రాయించుకొని, తమ డామినేషన్ చూపించుకుంటూ వుంటారు. విజయ్ దేవరకొండ మాత్రం దర్శకుడి కథలోకి వెళ్ళి, దర్శకుడు వూహించిన దానికంటే ఎక్కువ చేసి, దర్శకుడినే డామినేట్ చేసాడని అంటున్నారు.
bottomline:
విజయ్ దేవరకొండ – New Star