- ప్రేక్షకులు దేవుళ్ళు. అభిమానులు దేవుళ్ళకే దేవుళ్ళు. డబ్బులు & టైం వెచ్చించి సినిమాలు చూసే ప్రేక్షకులు అందరూ దేవుళ్ళు. నయా పైసా ఉపయోగం కాదు, చేతి నుండి డబ్బులు దూల తీర్చుకునే వాళ్ళు, ఏ సంబంధం లేకుండా సినిమాను ఓన్ చేసుకొని ఆరాధించే సినిమా అభిమానులు, దేవుళ్ళకే దేవుళ్ళు.
- “బొంగులే.. సినిమా బాగోకపొతే చూస్తారా ? సినిమా బాగుంటూనే కదా, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారు. ప్రేక్షకులు గొర్రెలు. అభిమానులు వెర్రోళ్ళు” అని కూడా వాదించే వాళ్ళు వున్నారు.
పై రెండిట్లో ఏది నిజం అంటే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి నమ్మకం వాళ్ళది.
అభిమానించడం అంటే కనెక్ట్ అవ్వడం. ప్రస్తుతం వారసత్వం & కులం చూసి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువయ్యారు అంటే తప్పు కాదెమో.
అలా వారసత్వం & కులం చూసి కనెక్ట్ అయ్యారని, మంచి సినిమాకు రోజులేవనుకుంటే తప్పు. ప్రేక్షకులు దేవుళ్ళు. మంచి సినిమాను వారత్వం & కులం లకు ఆతీతంగా ఆదరిస్తారు.
అభిమానులు దేవుళ్ళకే దేవుళ్ళు. ఎవరేజ్ సినిమాను తమ అభిమాన హాడావుడి & సపోర్ట్ తో రేంజ్ పెంచుతారు. “కేవలం అభిమానులు ఆదరిస్తే సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వవు. అందరూ చూస్తేనే పెద్ద పెద్ద హిట్లు అవుతాయి.” ఇది జగమెరిగిన సత్యం.
దురదృష్టం ఏమిటంటే, అతి అభిమానం వలన, అభిమానులకు అవమానాలు జరుగుతున్నాయి. హిరోలు సహనం కొల్పోతున్నారు. “మీ అతి అభిమానం మాకొద్దు, మేము కూర్చోమంటే కూర్చోవాలి, నుంచో మంటే నుంచోవాలి” అనే స్థాయికి మన హిరోలు వచ్చేసారు. అభిమానులను మందలిస్తే తప్పు లేదు కాని, అవమానిస్తున్నారు మన హిరోలు.
ఇదే అదనుగా అభిమానులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు కొందరు కత్తి మహేష్ కుమార్ లాంటి వాళ్ళు..
వారికి సమాధానంగా , అభిమానుల గురించి ఎంతో బాగా చెప్పిన అనంత్ శ్రీరామ్ కు థాంక్స్ !!!
తోడేలు నీ శత్రువు పైన దాడి చేసిందని సంతోషించకు దానికి ఆకలేస్తే నీ మీదకి కూడా వస్తుంది.
—అనంత్ శ్రీరామ్