ఫస్ట్‌లుక్‌

Haarika & Hassine C‏ @haarikahassine
Here’s the Concept poster of #PSPK25 on the eve of #PawanKalyan’s birthday! #HBDPawanKalyan @PawanKalyan #HaarikaHassine

తెలుగుసినిమా రేంజ్ ఏమిటో “బాహుబలి” సినిమా ద్వారా రాజమౌళి భారతదేశానికి చాటాడు. పవన్ కల్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” ద్వారా ఒక ప్రయత్నం చేసాడు, కాని విఫలం అయ్యింది. “కాటమరాయుడు” సినిమా రీమేక్ కావడంతో ఛాన్స్ లేదు అనుకున్నా, త్రివిక్రమ్ సినిమాకు కూడా దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపించడం లేదు.

ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చెయ్యకుండా కేవలం పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ అనే నమ్మకం మీదే, ఈ సినిమాను తెలుగుకే పరిమితం చేస్తూ, సినిమా పబ్లిసిటీ కానిచ్చేస్తున్నారు.

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రమిది. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

bottomline:
పవన్‌ పుట్టినరోజు సందర్భంగా Concept poster of #PSPK25 అని రిలీజ్ చేసారు. Concept ఏమిటో కూడా చెపితే బాగుండేది. టైటిల్ తో పాటు కాన్సప్ట్ మీద కూడా రూమర్స్ మొదలవుతాయి ఇప్పుడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.