చిరంజీవికి నిజం అర్దమయ్యిందా?

  1. చిరంజీవిని అవమానించాలని పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే ఏ మెగా అభిమాని కోరుకోడు
  2. పవన్ కల్యాణ్ పబ్లిక్ పంక్షన్స్ కు ఎక్కువగా రాడు, కాబట్టి, మెగా పబ్లిక్ ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ గురించి రెండు ముక్కలు మాట్లాడాలనే ఒత్తిడి ఎప్పటినుండో వుంది
  3. మెగా పబ్లిక్ ఫంక్షన్స్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అనే అరుపులు ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యాయి

పరిష్కారం చాలా సింపుల్: వాళ్ళు అడుగుతున్న రెండు ముక్కలు మాట్లాడేస్తే చాలు.

అత్యుత్సాహం ప్రదర్శించే అభిమానులు ఏ హిరోకైనా వుంటారు. వాళ్ళను జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. వాళ్లను అవమానించడం అంటే ఫ్యానిజం చేసే వాళ్ళను చంపేయడంతో సమానం. మెగా పబ్లిక్ ఫంక్షన్స్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం చిరంజీవిని అవమానించడం అన్నట్టు, చిరంజీవిని తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయి.

వివిధ కారణాలతో చిరంజీవి మీద ద్వేషం/కసి పెంచుకున్న వాళ్ళంతా, చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సక్సస్ అవ్వడం ఇష్టం లేక, అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తూ వుంటారు. ఇదేదో తన మీద ప్రేమతో మోస్తున్నారనే భ్రమలో నిజంగా తనను ఇష్టపడే మెగా అభిమానులను దూరం చేసుకొవడం అవివేకం.

చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. రామ్ చరణ్ .. తర్వాతే ఎవరైనా.

అల్లు అర్జున్, సాయి ధర్మ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఎంత సక్సస్ సాధించినా వాళ్ళ ముగ్గురి తర్వాతే. నెక్స్ మెగాస్టార్ మీరే అని ఎవరైనా అంటే అందులో నిజం లేదు. మీకొచ్చిన సక్సస్ కు ఆ క్షణంలో ఎక్కువ చూపించడానికి వాడే బాష. అది నిజం అనుకొని తలకెక్కించుకొని మెగా అభిమానులను అవమానించడం ద్వారా మీకు మైలేజ్ వస్తుందనుకుంటే, మీకు(అల్లు అర్జున్, సాయి ధర్మ్ తేజ్, వరుణ్ తేజ్ ) & కత్తి మహేష్ కుమార్ కు తేడా లేదు.

bottomline:
చిరంజీవికి నిజం అర్దం అయినట్టు వుంది

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.