సినిమా వాళ్ళంతా, సినిమాను సినిమాగానే చూడాలి. సినిమాలో చూపించేవన్నీ నిజాలు కాదు. సినిమా అంతా చెడు చూపిస్తూ, చెడు వలన జరిగే అనార్దాలు చూపిస్తూ, చెడుగా వుండోద్దని చెప్పడమే మా ప్రధాన వుద్దేశం అని చెపుతూ వుంటారు.
అలానే స్మోకింగ్ & డ్రింకింగ్ చెయ్యడం హిరోయిజంగా చూపిస్తూ వుంటారు. కానీ స్పైడర్ సినిమాలో మాత్రం దీనికి సంబంధించిన సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదట. విలన్ పాత్రలో నటిస్తున్న హీరో కూడా గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తాడే కానీ డ్రింక్ కానీ.. స్మోక్ చేస్తూ కానీ కనిపించరట. చివరికి బ్యాక్ గ్రౌండ్‌లో కూడా ఈ సీన్స్ కనిపించవట.
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంత భారీ బడ్జెట్ మూవీలో డ్రింకింగ్.. స్మోకింగ్ సీన్స్ లేకపోవడం నిజంగా ఓ విశేషమే.