కొందరిని మాత్రమే అంటూ అందరినీ ఏకిపాడేసాడు ..

నిజమైన విశ్లేషకుడు అంటే, అన్ని వర్గాల ప్రేక్షకులు కోణంలో ఆలోచించి, ఎవరికి ఏమి నచ్చుతుంది, నచ్చదనేది చెప్పగల్గాలి. విశ్లేషించడం కొందరికి గుల అయితే, మరికొందరు విశ్లేషణకు కాంట్రవర్సీ కామెంట్స్ యాడ్ చేసి జనాల మీదకు వదిలి పైశాచిక అనందం పొందుతూ వుంటారు.

ప్రస్తుతం విశ్లేషకులు ఎవరూ లేరు. విశ్లేషకులమని చెప్పుకునే వాళ్ళందరూ, ప్రేక్షకుల మాదిరి ఒక కోణంలో చూసే రివ్యూలు ఇస్తున్నారు.

ప్రస్తుతం కొత్త సినిమా లైఫ్ మూడు నాలుగు వారాలు మాత్రమే. ఈ రివ్యూలు మౌత్ టాక్ మాదిరే మంచి సినిమాకు ఉపయోగపడుతున్నాయి. చెడ్డ సినిమాను అడ్రస్ లేకుండా గల్లంతు చేస్తున్నాయి.

నిజం చెప్పాలంటే ఈ విశ్లేషకులు మంచి సినిమాను చంపలేరు. చెడ్డ సినిమాను బ్రతికించలేరు.

మరి ప్రొబల్మం ఏమిటి?
“జై లవ కుశ” సినిమా ఎన్.టి.ఆర్ నటనా పరంగా చూస్తే కచ్చితంగా అత్యధ్బుతం. కొందరికి కనెక్ట్ అవ్వకపోయి వుండవచ్చు.

ఈ సినిమా విషయంలో, ఈ సినిమా ఏ వుద్దేశంతో చేసారు, ఏ విధంగా చూస్తే నచ్చుతుందో జనాలకు తెలియజేయ వలసిన బాద్యత నిజమైన విశ్లేషకుల మీద వుంది. కాని కొందరు విశ్లేషకులు “జై లవ కుశ” సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తున్నారనేది జూ ఎన్.టి.ఆర్ ఆవేదన.

bottomline:

  1. కొందరిని మాత్రమే అంటూ, “జై లవ కుశ” సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తున్న అందరినీ ఏకిపాడేసాడు
  2. ఎన్.టి.ఆర్ ఆవేదనలో నిజం వుంది
  3. పనిగట్టుకొని మరీ, మిక్సిడ్ టాక్ వున్న సినిమాను చంపే ప్రయత్నం, సినిమాను ప్రేమించే వాళ్ళు చెయ్యడం తప్పు

httpv://youtu.be/AoKXO9ty0Bo

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జై లవ కుశ, Featured. Bookmark the permalink.