అల్లు అర్జున్ – “రామ్‌చరణ్ కంటే నేనేం తక్కువ, మెగా అభిమానులు నన్ను రామ్‌చరణ్ కంటే ఎందుకు తక్కువగా చూస్తున్నార”నే భావనను మెగా అభిమానులను అవమానించడం ద్వారా ఏదో సాధిద్దాం అనుకొని, మెగా అభిమానుల మధ్య పుల్లలు పెట్టి, మెగా అభిమానులకు దూరం అయ్యే పనిలో వున్నాడు.
జూ || ఎన్.టి.ఆర్ – మెగా వారసత్వం కోసం అల్లు అర్జున్ తెలివిగా ఎలా పావులు కదుపుతున్నాడో, అంతకంటే ఎక్కువ తెలివిగా తెలుగుదేశం వారసత్వం కోసం జూ || ఎన్.టి.ఆర్ పావులు కదుపుతున్నాడని లోకేష్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం & జూ|| ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులకు దృష్టిలో పెట్టుకొని ఎంతో కష్టపడి నిర్మించిన పక్కా మాస్ సినిమాలు. అంచనాలు ఎక్కువగా వుండటంతో మాస్ సినిమాలు అంటే విశ్లేషకులకు చిన్నచూపు వుండటం వలన, వెబ్ రివ్యూలు అంత ఎంకరేజింగ్ గా లేవు.
మాములుగా అయితే, నెగిటివ్ వెబ్ రివ్యూల సంగతి ఫ్యాన్స్ చూసుకుంటారు. “దువ్వాడ జగన్నాధం” & “జై లవ కుశ” సినిమాల విషయంలో సొంత ఫ్యాన్సే నెగిటివ్ వెబ్ రివ్యూలను ఎంకరేజ్ చేసారు/చేస్తున్నారు.
bottomline:
- పబ్లిక్ గా అవమానించాడు కాబట్టి, అల్లు అర్జున్ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాలి
- జూ|| ఎన్.టి.ఆర్ కు లోకేష్ తో ఎన్ని మనస్పర్దలు వున్నా, ఎక్కడా కూడా పబ్లిక్ గా చిన్న తప్పు మాట మాట్లాడలేదు. జూ|| ఎన్.టి.ఆర్ పై కొందరు నందమూరి అభిమానులు దుష్పాచారం చెయ్యడం సబబు కాదు.
- బాద్యత కలిగిన సినిమాను ప్రేమించే విశ్లేషకులు, ప్రేక్షకులను ప్రిపేర్ చెయ్యాలి కాని, ఇదే అదనుగా మిక్సిడ్ టాక్ వచ్చిన సినిమాలను చంపేయాలనుకొవడం తప్పు