అధికార ప్రభుత్వం మొప్పుపొందాలనో, మరొకరి మొప్పుపొందాలనో ప్రభుత్వాధికారులే పని చేస్తూ వుంటారు. ఇంకా ఈ అవార్డు కమిటి మెంబర్స్ ఎంత?
ఇదే అదనుగా మెగా చెంచాలు అందరూ మెగాఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకింత రాద్దాంతం?
ఎవరు అవార్డు ఆశీంచారో, వారికి రాకపొతే వాళ్ళు మాట్లాడటంలో తప్పు లేదు. మెగా హిరోలకు లేని నొప్పి ఈ చెంచాలకు ఎందుకు?
అవార్డు అంటే రికమెండేషన్ తో సంపాదించుకునేదో, డబ్బులిచ్చి కొనుకునేదో కాదు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి సాధించుకునేది అంతకంటే కాదు. ప్రజాదరణ కంటే ఈ అవార్డులు ఎక్కువ కాదు.
మెగా హిరోలకు రాలేదని అవార్డు వచ్చిన వాళ్ళ గురించి అగౌరవంగా మాట్లాడటం సరికాదు. అవార్డు గ్రహీతలను అభినందించడం ద్వారా ఆ అవార్డుల గౌరవాన్ని కాపాడవలసిన బాద్యత అందరిపై వుంది.