వై.యస్.యార్ & చంద్రబాబు బలమైన రాజకీయ నాయకులు. సొంత మీడియాలు వున్నాయి. వాళ్ళ దృష్టిలో రాజకీయం అంటే రాజకీయ ప్రత్యర్దులపై ఎటువంటి అస్త్రాలు ఉపయోగించినా తప్పు లేదు. చిరంజీవిని నలిపేసారు. చిరంజీవి తన స్వయంకృపరాదంతో వాళ్ళు సంధించిన రాజకీయ అస్త్రాలకు మరింత పదును పెట్టడంతో ప్రజలు చిరంజీవికి ఘోర పరాజయం చవిచూపించారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు వచ్చింది. బలమైన చంద్రబాబు & జగన్ లు ప్రత్యర్దులు. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి పవన్ కల్యాణ్ కూడా తన వంతు సహాయం అందించడం వలన, చంద్రబాబు వర్గం పవన్ కల్యాణ్ అంటే స్నేహితుడుగానే చూస్తున్నారు. జగన్ వర్గం మాత్రం వీలైనంత దుష్పాచారం చేసే పనిలో మునిగి వున్నారు. అందులో భాగంగా “రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సిరియస్ గా లేడు .. 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు” అని ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు వర్గం సపోర్ట్ వుంది కాబట్టి ఒకే, వాళ్ళు కూడా తోడయ్యి, రాజకీయ అస్త్రాలు సంధించడం మొదలుపెడితే పవన్ కల్యాణ్ ఎలా తట్టుకుంటాడో.