సోషల్ మీడియా పుణ్యమా, పవన్ కల్యాణ్ కు సంబంధించిన విషయాలు బాగా బయటకు వస్తున్నాయి. అజ్ఞాతవాసి షూటింగ్, ఆ తర్వాత అవార్డు, ఇప్పుడు పార్టీ ఆఫీసులో కార్యకర్తలుతో సమావేశం. సినిమాలు, స్పూర్తినిచ్చే ప్రసంగాలు, పార్టీ నిర్మాణం పనుల్లో క్షణం తీరిక లేకుండా పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడు.
అత్యుత్సాహంతో కాబోయే సి.యం అంటూ ఫ్యాన్స్ చేసే ఇబ్బందికరమైన అరుపులను ఖండించలేని పరిస్థితుల్లో నవ్వుతూ స్వీకరిస్తూ, చంద్రబాబు & జగన్ లు సంధించే రాజకీయ అస్త్రాలను ఎదుర్కొంటూ, పార్టీని విస్తరించుకొవాల్సి వుంది.