త్రివిక్రమ్ -పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇప్పటి వరకూ చిత్రబృందం స్పష్టత ఇవ్వలేదు. ఈ చిత్రబృందం ఇటీవలే యూరప్ వెళ్లి వచ్చింది. కీర్తి సురేష్, అనుఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా చేస్తోన్న ఈ చిత్రం కుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా టైటిల్ ఎనౌన్స్ చెయ్యకపొయినా, కాంబినేషన్ క్రేజ్ వలన ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి.
జనవరి 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 10కి ’50 days to Go’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పొస్టర్స్ రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించి ఈనెల 27వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ వారణాసిలో ప్లాన్ చేశారు . అక్కడే టాకీ పార్టు పూర్తి చేసి టైటిల్ను ప్రకటిస్తారని అంటున్నారు.