లాస్ట్‌ పంచ్‌ కోసం ఆరాటం

చిరంజీవి & రామ్‌చరణ్ ఎంత హ్యాపీగా వున్నారో చూడండి. కష్టపడుతున్నారు, ప్రజాదారణ పొందుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఏమి కావాలి? ఈ తొక్కలో అవార్డులు ఎవరికి కావాలి? .. చిరంజీవికి అవార్డు ఇస్తే, ఆ అవార్డుకే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ప్రజల్లో అటువంటి స్థానం సంపాదించుకున్నారు ఆయన.

అధికార ప్రభుత్వం తమకు ఇష్టమైన వాళ్ళను అవార్డ్ కమిటీ మెంబర్స్ గా నియమించడం జరుగుతూ వుంటుంది. ఆ మెంబర్స్ సాధ్యమైనంత రీతిలో కాంట్రవర్సీస్ లేకుండా అవార్డులు పంచుతూ వుంటారు.

దిక్కుమాలిన కాలంలో వున్నాం కాబట్టి.. ప్రాంతాలు(ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు), కులాలు, మతాలు, కుంటుంబాలు అని అన్నింటిని కవర్ చెయ్యవలసిన బాద్యత కమిటీ మెంబర్స్ పై వుంది.

అధికార ప్రభుత్వం మొప్పుపొందాలనో, మరొకరి మొప్పుపొందాలనో ప్రభుత్వాధికారులే పని చేస్తూ వుంటారు. ఇంకా ఈ అవార్డు కమిటి మెంబర్స్ ఎంత?.. ఎప్పుడూ జరిగేవిధంగానే అవకతవకలు జరిగాయి. పట్టించుకొవాల్సిన పనిలేదు. సొషల్ మీడియాలో కొన్నిరోజులు హాడావుడితో ముగిసేది.

ప్రజాదరణతో మెగా హిరోలు బాగానే వున్నారు. కాని, అల్లు అరవింద్ మొప్పుకోసం, కాపు కులానికి చెందిన మెగా చెంచాలు మెగాఫ్యామిలీకి ఏదో అన్యాయం జరిగిపొయినట్టు ప్రచారం మొదలుపెట్టారు.   కమ్మ కులానిని చెందిన మెగా చెంచాలు కమ్మ అవార్డులు,  సైకిల్ అవార్డులని కుల ముద్ర వేసే ప్రయత్నం చేసారు.

పాపం ‘ABN RK’ సినీ పెద్దలందరితో ఒక పెద్ద చర్చా కార్యక్రమం నిర్వహించి, “మీ పరువు మీరే తీసుకొవద్దు” అని ఫుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేసాడు. అంతా సర్దుమణిగిందనుకుంటున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..’ అంటూ  పవన్‌కళ్యాణ్‌ చేత చెప్పించిన డైలాగ్‌  లోకేష్ మదిలోకి వచ్చినట్టు వుంది. లోకేష్ పంచ్  హుందాగా వుంటే బాగుండేది కాని, మరింత రెచ్చగొట్టే విధంగా వుండటంతో, సరదాగా తీసుకునే వాళ్ళకు ఎంటర్‌టైన్‌మెంట్, సిరియస్ గా తీసుకునే వాళ్ళకు బిపి & షూగర్ లెవెల్స్ పెరిగే అవకాశం వుంది.

bottomline:

ఈ రాద్దాంతం వలన, తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదో అవార్డులు ఇవ్వాలనుకుంటే ..  ప్రాంతాలు(ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు), కులాలు, మతాలు, కుంటుంబాలు అని అన్నింటిని కవర్ చేస్తూ సమానంగా అవార్డులు పంచే అవకాశం వుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.