రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నరు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జవాన్ డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రయిలర్ బాగా కట్ చేసారు.
“లైఫ్లో మనకేదైనా మిస్ అయిందంటే.. దానర్థం మనం దేనికి పనికి రామని కాదురా.. మనం ఇంకా దేనికో పనికొస్తామని..”, “యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.. ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా.. లేదా? అన్నదే ముఖ్యం” డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా వున్నాయి.