నేను వేరు .. సినిమా వేరు ..

Pawan Kalyan‏Verified account @PawanKalyan

I would like to pay my respects & love to cinema which gave me your immense love & the strength to serve our society through this platform – @pkcreativeworks which is my new twitter account dedicated to cinema..

అన్నయ్య చిరంజీవి తమ్ముడిగా పవన్‌కల్యాణ్ అంటే మెగా అభిమానులకు ప్రత్యేకాభిమానం. కారణాలు విశ్లేషించడం కష్టం కాని, మెగా అభిమానులకు తోడు, మెగాభిమానులని మించి అభిమానించే సొంత అభిమానులను పవన్ కల్యాణ్ సంపాదించుకున్నాడు. పవన్ కల్యాణ్ మావాడంటే మావాడని ఆ రెండు విభిన్న అభిమాన వర్గాల అత్యుత్సాహంలో పవన్ కల్యాణ్ నలిగిపొతూ వుంటాడు. అదే వేరే విషయం. ఇదే అదనుగా చిరంజీవి vs పవన్ కల్యాణ్ అనే వాదనలో అన్నయ్య చిరంజీవికే అభద్రతాభావం క్రియేట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. జరుగుతూనే వుంటాయి.

అసలు వర్గాలను పట్టించుకొని పవన్ కల్యాణ్ జీవనాధారం కోసం సినిమాలు చేస్తూ, మరోపక్క రోజురోజుకు దిగజారిపోతున్న రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న దృడ సంకల్పంతో రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ఆ రెండు ప్రయాణాలను మిక్స్ చెయ్యకూడదనే ఆలోచనతో, తన పేరు మీద వున్న ట్వీటర్ ఎకౌంట్ ను రాజకీయాలకు అంకితం చేసి, సినిమాల కోసం మరోక ట్వీటర్ ఎకౌంట్ వాడదల్చానని పవన్ కల్యాణ్ తెలియపరిచాడు. ఈ ఎకౌంట్ ద్వారానే #PSPK25 ఫస్ట్ లుక్ & టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఎక్సపెట్ చేస్తున్నారు.

bottomline:
great job by PSPK team. పవన్ కల్యాణ్ ను బాగానే నడిపిస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.