త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా వస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
తెలుగుసినిమాలను ఇలా నాలుగు ముక్కలు చేస్తే 1) పక్కా మాస్ సినిమా, 2) పక్కా క్లాస్ సినిమా, 3) క్లాస్ కు కూడా నచ్చే మాస్ సినిమా & 4) మాస్ కు కూడా నచ్చే క్లాస్ సినిమా .. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎక్కువ శాతం మూడో రకం “క్లాస్ కు కూడా నచ్చే మాస్ సినిమాలు”. చిరంజీవికి మాత్రమే అలా కుదిరింది. థియేటర్స్ లో క్లాస్ చేత కూడా మాస్ స్టెప్పులు విజిల్స్ వేయించిన హిరో చిరంజీవి. చిరంజీవి ప్లేస్ ను ఎవరూ భర్తీ చెయ్యలేకపొయారు.
పవన్ కల్యాణ్ ప్రత్యేకత ఏమిటంటే చిరంజీవి ఫార్ములాను అసలు ఫాలో అవ్వకపొవడం. “మాస్ కు కూడా నచ్చే క్లాస్ సినిమాలు” అంటేనే పవన్ కల్యాణ్ కు ఇష్టం. “పక్కా క్లాస్ సినిమాలు” చేసే ప్రయత్నం అసలు చెయ్యలేదు కాని, పక్కా మాస్ సినిమాలతో పెద్ద పేరు వచ్చిన సినిమాలు లేవనే చెప్పొచ్చు.
పవన్ కల్యాణ్ ఇష్టపడే “మాస్ కు కూడా నచ్చే క్లాస్ సినిమాలు” తీసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ సాదాసీదాగా వుంది. కాకపొతే చుర చుర చూపులతో చేతిలో ఐడీ కార్డ్‌ను గింగిరాలు తిప్పుతూ వున్న స్టిల్ అటు అభిమానులకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేస్తుంది.