రంగస్థలం 1985 ఘన విజయం

సుకుమార్ కొత్తగా ఎవరూ ఊహించని విధంగా ఆలోచిస్తాడు, ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే అతని సినిమాలు వుంటాయనే తెలుగు ప్రేక్షకులు ఫిక్స్ అయిపొయారు. కాకపొతే ఆ రేంజ్ లో కమర్షియల్ సక్సస్ లేదు.

సుకుమార్ కు ఇప్పుడు రామ్‌చరణ్‌తో పనిచేసే అవకాశం వచ్చింది.  ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని రేయింబవళ్ళు ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు పెద్ద ప్లస్ ఏమిటంటే, ఈ సినిమా మేకింగ్ కు & పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కావాల్సిన టైం కంటే ఎక్కువ టైం దొరికింది.  రామ్‌చరణ్ సహకారం & సపోర్ట్ తో సుకుమార్ ఈ సినిమా అందంగా చెక్కుతున్నాడని టాక్ నడుస్తుంది. (ధృవ సినిమా కూడా సురేందేర్ రెడ్డి అలానే అందంగా చెక్కాడు)

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన ట్విట్టర్ పేజీలో ఈ సినిమాపై ఓ ట్వీట్ చేశాడు. ‘‘నేను రీసెంట్‌గా రంగస్థలం 1985 చిత్ర సెట్స్‌ని సందర్శించాను. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. అందులో ఎటువంటి డౌట్స్ వద్దు. ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినట్లుగా సుకుమార్ అండ్ టీమ్ తెలిపారు. అలాగే రత్నవేలుగారి ఫొటోగ్రఫీకి ఈ సినిమాని ఉన్నత స్థానంలో నిలబెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మన రామ్ చరణ్‌ ఇటువంటి సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప ప్రయత్నం..’’ అంటూ పోస్ట్ చెయ్యడంతో  మీడియాలో ఈ సినిమా సంబంధించి న్యూస్ క్రియేట్ అయ్యింది.

మెగా అభిమానులంతా అజ్ఞాతవాసి సినిమా ఊపులో వుండటం &  ఈ సినిమా రిలీజ్ చాలా దూరం వుండటం వలన ఈ న్యూస్ కు అంత ప్రాదాన్యత లభించలేదు.

 

thaman S‏Verified account @MusicThaman Dec 1
I have recently visited the sets of #Rangasthalam its a sure shot film 🎥 from team #sukumar heard Devi has done some kickass music for it @RathnaveluDop on top form .

This film will be a very truest attempt our mega power star #rct ♥️💪🏼

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in News. Bookmark the permalink.