శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో జనాదరణ పొందలేకపొయినా, కమర్షియల్ సక్సస్ చేసుకొని తెలుగు ఇండస్ట్రీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం పొరాడుతున్న మెగా హిరో అల్లు శిరీష్. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నివాడా మరి గుర్తింపు పొందిన దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి, “ఒక్క క్షణం” సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర టీజర్ విడుదలయ్యింది.
ఈ ప్రపంచంలో ఓ ఇద్దరు వ్యక్తుల జీవితాలు సమాంతరంగా ఉండే అవకాశం ఉందని, అందులో ఒకరి గతం మరొకరి భవిష్యత్తు కావచ్చనే కాన్సెప్ట్‌తో ‘ఒక్క క్షణం’ అనే సినిమాను తెరకెక్కించినట్టు ఈ టీజర్ ద్వారా చెప్పారు. ప్రేమించిన అమ్మాయి కోసం చావడానికికైనా సిద్ధపడే కుర్రాడి పాత్రలో అల్లు శిరీష్ నటిస్తున్నట్టుగా అర్దం అవుతుంది. ఈసారి జనాదరణ & కమర్షియల్ సక్సస్ రెండు పొందేలా సినిమా వుంటుందనిపించేలా టీజర్ వుంది.