‘‘హార్ట్ టచింగ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది. వరుణ్ తేజ్‌ను కొత్త క్యారక్టరైజేషన్‌లో చూస్తారు. డిసెంబర్‌లో షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’
— నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్.
వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ ‘ఫిదా’ పెద్ద హిట్. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఆ సినిమా క్రియేటర్ శేఖర్ కమ్ముల మినహా ఎవరూ ఊహించలేదు. మెగా సినిమాలు హిట్ అయితే పేరంతా మొదట హిరోలకే ఎక్కువ వస్తుంది కాని, ఫిదా సినిమా విషయంలో మాత్రం హిరో స్థానం దర్శకుడు, హిరోయిన్, నిర్మాత తర్వాత నాలోగో స్థానంలోకి పడిపోయింది. మెగా హిరోలకు భిన్నంగా, ఇదే వరుణ్ తేజ్ ప్రత్యేకత అనుకొవచ్చు. డామినేట్ చెయ్యడానికి ఎక్కడా కూడా ప్రయత్నం చెయ్యడు.
‘ఫిదా’ తర్వాత వరుణ్ చేస్తోన్న మరో లవ్‌స్టోరీ ‘తొలి ప్రేమ’.
వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను సోమవారం చిత్రబృందం అధికారికంగా రిలీజ్ చేసింది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి తొలిలుక్ వదలడం విశేషం.