ఉయ్యలవాడ నరసింహారెడ్డి బయోపిక్ పరుచూరి బ్రదర్స్ కలల ప్రాజెక్టు. చిరంజీవి లేదా బాలయ్య , ఎవరు చేస్తే వాళ్ళతో చెయ్యడానికిఉయ్యలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడంతో పాటు, ఒక మంచి స్క్రీన్‌ప్లే కూడా వ్రాసుకున్నారు. ఆ సినిమాకు అయ్యే ఖర్చుకు వెనుకాడి, తిరిగి రావు అన్న భయంతో వాళ్ళు చేయలేకపొయారు. పెరిగిన తెలుగు కమర్షియల్ రేంజ్ & ఖైదీ నెం 150 సినిమా ఇచ్చిన భరోసాతో చిరంజీవి చేయదల్చుకున్నాడు.
ధృవ సినిమాతో చరణ్‌కు దగ్గరయ్యిన సురేందర్ రెడ్డి ఈ సినిమా దర్శకత్వం చెయ్యడానికి ముందుకొచ్చి, పరుచూరి బ్రదర్స్ తయారు చేసిన స్క్రిప్ట్ ను ఓన్ చేసుకొని మరింత మెరుగుపరిచాడని స్క్రిప్ట్ విన్న, సురేందర్ రెడ్డి స్నేహితులు మీడియాకు వెల్లడిస్తున్నారు. “సైరా నరసింహారెడ్డి” అని అందరినీ ఆకట్టుకున్న టైటిల్ కూడా పెట్టాడు.
రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. చిత్రం కోసం హైదరాబాద్ కొండాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరంజీవి & పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్ట్‌ల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.