నాగార్జున నిర్మాతగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హలో’. ఈనెల 22న విడుదల కానున్న ఈ సినిమా పై అంచానాలు పెంచే పనిని స్వయంగా నాగార్జునే తీసుకున్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ జగపతిబాబు అఖిల్ కు పేరెంట్స్ గా నటించారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించాడు.
సినిమా ప్రమోషన్లో భాగంగా నిన్న నాగార్జున రిలీజ్ చేసిన 1.17 నిమిషాల నిడివిగల ‘మెరిసే మెరిసే మెరిసే..’ అనే పాట టీజర్ అదిరిపొయిందంటున్నారు జనాలు.